Begin typing your search above and press return to search.

‘రంగస్థలం’ టీం వెబ్‌ సిరీస్‌ కు రెడీ

By:  Tupaki Desk   |   2 May 2020 1:20 PM IST
‘రంగస్థలం’ టీం వెబ్‌ సిరీస్‌ కు రెడీ
X
రామ్‌ చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచిన విషయం తెల్సిందే. అద్బుతమైన కథ మరియు స్క్రీన్‌ ప్లేతో చరణ్‌ ను కెరీర్‌ లోనే ది బెస్ట్‌ గా సుకుమార్‌ చూపించాడు. చెవులు వినిపించని వ్యక్తి పాత్రలో చరణ్‌ ను ఆల్‌ టైం బెస్ట్‌ గా రంగస్థలంలో ప్రజెంట్‌ చేయడం జరిగింది. మళ్లీ చరణ్‌ అటువంటి పాత్రను కాని ఆ జోనర్‌ లో సినిమాను కాని చేస్తాడో లేదో చెప్పలేము. అందుకే సుకుమార్‌ అంటే చరణ్‌ కు అమితమైన గౌరవం అభిమానంగా మెగా వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ఆ అభిమానంతో సుకుమార్‌ తో కలిసి ఒక వెంచర్‌ కు చరణ్‌ రెడీ అయ్యాడు.

చరణ్‌ ఇప్పటికే నిర్మాతగా ఖైదీ నెం.150 ఇంకా సైరా నరసింహారెడ్డి చిత్రాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం ఆచార్యను కూడా నిర్మిస్తున్నాడు. ఒక వైపు సినిమాలను నిర్మిస్తూ మరో వైపు వెబ్‌ సిరీస్‌ కు కూడా రెడీ అయ్యాడట. సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్‌ ప్రకారం సుకుమార్‌ మరియు చరణ్‌ లు సంయుక్తంగా ఒక వెబ్‌ సిరీస్‌ ను నిర్మించబోతున్నారట. ఆ వెబ్‌ సిరీస్‌ కు స్క్రిప్ట్‌ ను అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా సుకుమార్‌ చేయబోతున్నాడట.

అమెజాన్‌ ప్రైమ్‌ తో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని సమాచారం. వీరిద్దరి భాగస్వామ్యంతో పాటు అమెజాన్‌ ప్రైమ్‌ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించబోతున్నారట. ఈ లాక్‌ డౌన్‌ పూర్తి అయిన వెంటనే షూటింగ్‌ ప్రారంభం అయ్యే అవకాశం ఉందట. థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్‌ కాకముందే ఈ వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తే మంచి లాభాలు వస్తాయనే నమ్మకంతో అమెజాన్‌ ప్రైమ్‌ ఉందట.

పుష్ప కోసం ఎర్ర చందనం స్మగ్లింగ్‌ ఇంకా శేషాచలం అడవులపై రీసెర్చ్‌ చేసిన సుకుమార్‌ చాలా విషయాలను సేకరించాడట. పుష్ప చిత్రంలో చూపించేవే కాకుండా చాలా సంఘటనలు సన్నివేశాలు ఆయన మదిలో ఉన్నాయట. పుష్ప సినిమా ఏ కాన్సెప్ట్‌ తో రూపొందబోతుందో అదే బ్యాక్‌ డ్రాప్‌ తో విభిన్నమైన కథతో వెబ్‌ సిరీస్‌ కు సుకుమార్‌ స్క్రిప్ట్‌ ను రెడీ చేస్తున్నాడట. సుకుమార్‌.. చరణ్‌ ల పేర్లు టైటిల్‌ కార్డ్స్‌ లో ఉన్నా కూడా చాలు. అది సినిమా అయినా వెబ్‌ సిరీస్‌ అయినా దుమ్ము రేపడం ఖాయం అంటున్నారు. ఈ కాంబో హిట్‌ అయితే ఇలాంటి వెబ్‌ సిరీస్‌ లు తెలుగులో మరిన్ని వచ్చే అవకాశం ఉంది.