Begin typing your search above and press return to search.

రంగస్థలం బాక్స్ ఆఫీస్ దెబ్బ అదుర్స్!

By:  Tupaki Desk   |   10 April 2018 2:05 PM GMT
రంగస్థలం బాక్స్ ఆఫీస్ దెబ్బ అదుర్స్!
X
ఈ రోజుల్లో ఒక సినిమాను ఎంత కష్టపడి తెరకెక్కించిన సరిగ్గా ఆడేది ఒక వారమే. ఆ వరం కలెక్షన్స్ పైనే నిర్మాతలు ఎక్కువగా ఆశలు పెట్టుకుంటారు. అయితే ఎప్పుడో గాని వరుసగా రెండు మూడు వారలు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడిచే సినిమాలు రావు. మెగా స్టార్ నుంచి చాలా కాలం తరువాత అలాంటి సినిమా ఒకటి వచ్చింది. అదే రంగస్థలం సినిమా. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ సమంత జంటగా నటించిన ఈ సినిమా మొదటి వారంతో పాటు రెండవ వారం కూడా మంచి కలెక్స తో దూసుకుపోతోంది.

రెండవ సోమవారం కూడా సినిమా ఏపీ - తెలంగాణాలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోయింది. సోమవారం ఈ సినిమా 3.50 కోట్ల గ్రాస్ ను అందుకొని 2.06 కోట్ల రూపాయల షేర్ ను అందించింది. ఇప్పటికే సినిమా 11 రోజుల కలెక్షన్స్ ని చుస్తే ఇండియాలో 110 కోట్ల గ్రాస్ ను అందుకున్నట్లు తెలుస్తోంది. యూఎస్ లో 3 మిలియన్ మార్క్ ను అందుకొని బాహుబలి నాన్ రికార్డులను బద్దలు కొట్టింది. ఇక వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఇప్పటివరకు 95 కోట్ల షేర్ తో 158 కోట్ల గ్రాస్ అను అందుకున్నట్లు సమాచారం. చూస్తుంటే ఖైదీ నెంబర్ 150 ( 102కోట్ల షేర్స్) రికార్డును బద్దలు కొట్టేలా ఉందని చెప్పవచ్చు.

రంగస్థలం యొక్క 11 రోజుల AP & TS కలెక్షన్స్ ఇలా ఉన్నాయి:

నైజం - 20,20,00,000

సీడెడ్ - 13,40,00,000

నెల్లూరు - 2,54,29,673

గుంటూరు - 6,86,00,000

కృష్ణ - 5,55,79,85,852

వెస్ట్ - 4,72,14,295

ఈస్ట్ - 6,03,00,000

ఉతరంద్రా - 9,84,86,597

మొత్తం 11 రోజులు AP & TS వాటా - Rs 69.16 Cr