Begin typing your search above and press return to search.

'సిరి సిరి మువ్వల్లోనా'.. DSP కంపోజ్ చేసిన సోల్ ఫుల్ మ్యాజికల్ మెలోడీ..!

By:  Tupaki Desk   |   1 Aug 2022 1:31 PM GMT
సిరి సిరి మువ్వల్లోనా.. DSP కంపోజ్ చేసిన సోల్ ఫుల్ మ్యాజికల్ మెలోడీ..!
X
'కొండపొలం' వంటి పరాజయం తర్వాత మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్.. ఇప్పుడు ''రంగ రంగ వైభవంగా'' సినిమాతో రాబోతున్నాడు. ఇదొక న్యూ ఏజ్ యూత్ ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. ఇందులో మెగా హీరో సరసన కుర్ర భామ కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది.

రిలీజ్ కు రెడీ అయిన 'రంగ రంగ వైభవంగా' సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు ‘తెలుసా తెలుసా’ మరియు ‘కొత్తగా లేదేంటి’ వంటి రెండు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'సిరి సిరి మువ్వల్లోనా' అనే మరో సాంగ్ ను రిలీజ్ చేశారు.

'సిరి సిరి సిరి సిరి మువ్వల్లోనే దాగుండే చప్పుళ్లన్నీ.. నా గుప్పెడు గుండెల్లోనే వినిపించాయి..' అంటూ సాగిన ఈ గీతం సంగీత ప్రియులను విశేషంగా అలరిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ మ్యాజికల్ మెలోడీకి సోల్ ఫుల్ ట్యూన్ సమకూర్చారని చెప్పాలి.

గీత రచయిత శ్రీమణి సాహిత్యం అందించగా.. జావేద్ అలీ మరియు శ్రేయా ఘోసల్ కలిసి ఆలపించారు. ఊటీలోని ఎక్సోటిక్ లొకేషన్లలో చిత్రీకరించిన ఈ పాటలో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ శామ్‌దత్ సైనుద్దీన్ ప్రధాన జంటను అందంగా చూపించారు.

వైష్ణవ్ తేజ్ మరియు కేతిక శర్మ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. వర్షంలో రొమాన్స్ చేస్తూ ఆకట్టుకున్నారు. దీనికి శోభి మాస్టర్ కంపోజ్ చేసిన సింపుల్ స్టెప్స్ కూడా ఆకర్షణగా నిలిచాయి. మొత్తం మీద 'సిరి సిరి మువ్వల్లోనా' వింటేజ్ దేవిశ్రీని గుర్తు చేస్తూ.. విన్న వెంటనే మైండ్ లోకి ఎక్కేస్తుంది.

''రంగ రంగ వైభవంగా'' చిత్రానికి గిరీశయ్య దర్శకత్వం వహించారు. ఇంతకముందు దర్శకుడు 'అర్జున్ రెడ్డి' రీమేక్ గా తమిళంలో 'ఆదిత్య వర్మ' సినిమా తీసి సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు తెలుగులో డైరెక్టర్ గా సక్సెస్ ఫుల్ గా ఎంట్రీ ఇవ్వాలని ఆశ పడుతున్నాడు.

బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై BVSN ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ చేశారు. RRV సినిమా సెప్టెంబర్ 2న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. మరి 'ఉప్పెన' తో బ్లాక్ బస్టర్ అందుకున్న వైష్ణవ్ తేజ్.. ఈసారి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.