Begin typing your search above and press return to search.

పిక్ టాక్: గమ్మత్తైన లుక్కులో రంగమ్మత్త కేక..

By:  Tupaki Desk   |   1 Jan 2021 8:24 AM GMT
పిక్ టాక్: గమ్మత్తైన లుక్కులో రంగమ్మత్త కేక..
X
ఈ లుక్ లో అనసూయ ఎలా ఉంది? అమర శిల్పి జక్కన్న చెక్కిన పాలరాతి శిల్పంలా.. పాలకడలిలో జలకాలాడి ఫ్రెష్ గా డ్రెస్ చేసుకున్న అప్సరసలా లేదూ..?! నిజానికి ఈ పిక్ లో అనసూయ మెరుపు ముందు ఆమె వేసుకున్న పింక్ డ్రెస్ పూర్తిగా డిమ్ అయిపోయిందనే చెప్పాలి. ఇక, ఆమె పరువాలపై కన్నుపడితే.. యువతరం పరవశించి పోయి పరవళ్లు తొక్కుతూ వచ్చేస్తుంది కవిత్వం!

డార్క్ పెన్సిల్ తో చక్కగా షేప్ చేసుకొన్న ఐబ్రోస్ పికాసో పిక్ ను గుర్తు చేస్తుంటే.. తన్మయత్వంతో క్లోజ్ అయిన కళ్లు మనసులో ఏదో సీక్రెట్ చెప్తున్నాయి. సింగారించుకున్న ఐలాష్.. మెల్లగా పక్కకు జారిన ముంగురులు, దొండపండు లాంటి లిప్స్.. లుక్ వన్స్ మోర్ అంటున్నాయి.

ఇక లైట్ క్లీవేజ్ షో కుర్రకారు మతి పోగొడుతుంటే.. ఎదపై ముద్రించిన అక్షరాలు ‘నా పేరు చెప్పుకోండి.. మీలో ఎవరైనా’ అని కవ్విస్తున్నాయి. ఈ విధంగా ఆమె శరీరంలోని అనువణువూ అందానికి కేరాఫ్ అని చాటుతున్నాయి.

బుల్లితెర ‘రంగస్థలం’పై జెండా పాతిన రంగమ్మత్త.. బిగ్ స్క్రీన్ పైనా తనదైన స్టాంప్ వేసేసింది. ఆమె నటనకు ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. అయితే.. ఫ్యాన్స్ కు ఇంకా ఏదో ఇవ్వడానికి అనూ.. ఇస్తే తీసుకోవడానికి అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. మరి, ఛాన్స్ ఇవ్వాల్సింది మాత్రం మూవీ మేకర్సే.