Begin typing your search above and press return to search.
సాంగ్ టాక్: రంగమ్మ కూడా బాగుందయ్యో!!
By: Tupaki Desk | 8 March 2018 1:11 PMరామ్ చరణ్ మూవీ రంగస్థలం హంగామా రానురానూ ఎక్కువైపోతోంది. అసలే వారం రోజుల నుంచి థియేటర్లు బంద్. జనాలకు థియేటర్ ఎంటర్టెయిన్మెంట్ మిస్ అయిపోయింది. పైగా పరీక్షల సీజన్ కూడా వచ్చేసింది. ఎగ్జామ్స్ సీజన్ తర్వాత మొదటగా వచ్చే పెద్ద సినిమా రంగస్థలమే. పైగా దీని విడుదలకు మరో 21 రోజుల గ్యాప్ మాత్రమే ఉంది.
అందుకే పబ్లిసిటీ హంగామా కూడా పెంచేసింది మూవీ యూనిట్. ఇప్పుడీ సినిమాలోంచి మూడో పాటను విడుదల చేశారు. 'రంగమ్మా.. మంగమ్మా' అంటూ సాగే ఈ పాట.. దేవిశ్రీ ప్రసాద్ మార్క్ సంగీతంతో ఆకట్టుకుంటుంది. లిరికల్ సాంగ్ మొత్తాన్ని చిన్ని చిన్ని పదాలతోనే ప్రాసలు కలిపి రాసిన తీరును ఎంత పొగిడినా తక్కువే. చంద్రబోస్ సాహిత్యానికి.. రాక్ స్టార్ సంగీతం జోడించాక.. ఇక తిరుగేముంటుంది.. కాకపోతే తొలి రెండు పాటలతో పోల్చితే కాస్త డల్ అనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు.
కానీ ఈ రంగమ్మ పూర్తిగా మాంటేజ్ బేస్డ్ సాంగ్ అని చెప్పాలి. మొదటి సారి కాకపోయినా.. రెండోసారి మూడోసారి వినేటపుడు గ్యారంటీగా ఎక్కేస్తుంది. బాణీ కూడా అంత క్యాచీగా కుదిరింది. ఇక ఈ రంగమ్మ పాటను పాడిన ఎంఎం మానసి ని అభినందించాలి. ఎంతో సింపుల్ గా అనిపిస్తున్నా.. ఆ పాటకు తన గాత్రంతో ప్రాణం పోసింది ఈమె. అన్నిటికంటే మించి ఈ లిరికల్ సాంగ్ లో రాంచరణ్ స్టైల్ కి.. సమంత అందాల డోస్ కలిసి బోలెడంత ఆకర్షణ అయిపోయింది.
టీజర్ కోసం క్లిక్ చేయండి