Begin typing your search above and press return to search.

డబ్బింగ్ మోజు మరీ ఈ స్థాయిలోనా?

By:  Tupaki Desk   |   15 Oct 2016 9:00 PM IST
డబ్బింగ్ మోజు మరీ ఈ స్థాయిలోనా?
X
తమిళ హీరో సినిమా ఒకటి తెలుగులోకి అనువాదమై బాగా ఆడిందంటే చాలు.. ఇక అతడి పాత కొత్త సినిమాలన్నింటినీ వరుసబెట్టి తెలుగులోకి దించేస్తుంటారు. ఈ క్రమంలో తమిళనాట అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాల్ని కూడా వదిలిపెట్టరు. తెలుగు నుంచి తమిళంలోకి రీమేక్ అయిన సినిమాల్ని కూడా మళ్లీ తెలుగులోకి అనువాదం చేసే స్థాయికి వెళ్లిపోయింది ఈ పైత్యం. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఉదాహరణలు చాలా కనిపించాయి.

తాజాగా రంగం-2 పేరుతో ఒక సినిమా గురించి హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. జీవా కథానాయకుడిగా తమిళంలో ‘యాన్’ పేరుతో తెరకెక్కిన సినిమా ఇది. ఇండియాలోనే టాప్ సినిమాటోగ్రాఫర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న రవి.కె.చంద్రన్ ఈ సినిమాతోనే దర్శకుడిగా మారాడు. ‘కడలి’ లాంటి డిజాస్టర్ తో కథానాయికగా పరిచయమైన రాధ కూతురు తులసి నాయర్ హీరోయిన్ గా నటించింది. శ్రీకర్ ప్రసాద్.. సాబు సిరిల్ లాంటి టాప్ టెక్నీషియన్లు పని చేశారు ఈ చిత్రానికి.

రెండేళ్ల కిందట భారీ అంచనాలతో విడుదలైన ‘యాన్’ పెద్ద ఫ్లాప్ అయింది. ఇప్పుడీ సినిమాకు ‘రంగం-2’ అనే టైటిల్ తగిలించి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. రంగం అన్న మాట వినిపించగానే ప్రేక్షకులు పరుగెత్తుకుని వచ్చేస్తారని నమ్మకం కాబోలు. ఒక మంచి సినిమాను తెలుగులోకి అనువాదం చేసి.. దానికి మంచి పబ్లిసిటీ చేస్తే తప్పేం లేదు. కానీ తమిళంలో ఫ్లాప్ అయిందని తెలిసి కూడా తెలుగులోకి అనువాదం చేయడంలో ఆంతర్యమేంటి.. ఇది ప్రేక్షకుల్ని మోసం చేయడమే కదా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/