Begin typing your search above and press return to search.

రంగ రంగ వైభ‌వంగ మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌స్తాడా?

By:  Tupaki Desk   |   27 Aug 2022 12:31 PM GMT
రంగ రంగ వైభ‌వంగ మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌స్తాడా?
X
సాయిధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు, `ఉప్పెన‌` ఫేమ్ పంజా వైష్ణ‌వ్ తేజ్ న‌టించిన లేటెస్ట్ మూవీ `రంగ రంగ వైభ‌వంగ‌`. `రొమాంటిక్‌` ఫేమ్ కేతిక శ‌ర్మ హీరోయిన్ గా న‌టించింది. త‌మిళంలో `అర్జున్ రెడ్డి`ని ఆదిత్య వ‌ర్మ‌`గా రీమేక్ చేసి ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చుకున్న గిరీషాయ ఈ మూవీతో తెలుగులో ప‌రిచ‌యం అవుతున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ ఎల్ పీ బ్యాన‌ర్ పై బీవీఎస్ ఎన్ ప్ర‌సాద్ నిర్మించారు. సెప్టెంబ‌ర్ 2న ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

బాపినీడు స‌మ‌ర్ప‌ణ‌లో రొమాంటిక్ ఫ్యామిలీ ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ మూవీని తెర‌కెక్కించారు. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్ ల‌తో సినిమాపై మంచి బ‌జ్ క్రియేట్ అయింది. చిన్న త‌నం నుంచి ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌ని ఇద్ద‌రు యువ‌తీ యువ‌కుల క‌థ‌గా ఈ మూవీని ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా రూపొందించారు.

ఇద్ద‌రి మ‌ధ్య మొద‌లైన గొడ‌వ ఆ త‌రువాత క్ర‌మంగా ఈగోగా మారడం.. అదే ఇద్ద‌రి మెడికోల‌ మ‌ధ్య ప్రేమ‌కు బాట‌లు వేయ‌డం.. ఇరు కుటుబాలు వారి ప్రేమ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారా? లేదా అనే క‌థ‌, క‌థనాల‌తో ఈ మూవీని తెర‌కెక్కించారు.  

ఎంట‌ర్ టైన్ మెంట్ ని ప్ర‌ధానంగా తీసుకుని ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కించిన తీరు ఆక‌ట్టుకునేలానే వుందని ట్రైల‌ర్ తో స్ప‌ష్ట‌మైంది. న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ మూవీతో ఎలాగైనా మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ లోకి రావాల‌ని వైష్ణ‌వ్ తేజ్ గ‌ట్టి న‌మ్మ‌కంతో వున్నాడు. `ఉప్పెన‌` తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకున్న వైష్ణ‌వ్ తేజ్ ఆ త‌రువాత క్రిష్ తో చేసిన `కొండపొలం` ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయిన విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో `రంగ రంగ వైభవంగ‌`పై వైష్ణవ్ తేజ్ భారీ అంచ‌నాలు పెట్టుకున్నాడు. ప‌లు ద‌ఫాలుగా రిలీజ్ వాయిదా ప‌డుతూ వ‌చ్చిన`రంగ రంగ వైభవంగ‌` ఎట్ట‌కేల‌కు సెప్టెంబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

రొటీన్ క‌థే అయినా ఇద్ద‌రి ఈగోల నేప‌థ్యంలో సాగే క‌థ కావ‌డంతో ఖ‌చ్చితంగా ఈ మూవీ ఆక‌ట్టుకోవ‌డం ఖాయం అని చిత్ర బృందం గ‌ట్టి న‌మ్మ‌కంగా చెబుతోంది. తాజాగా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ మూవీకి యు/ఏ ల‌భించింది. మ‌రి టీమ్ న‌మ్మ‌కానికి త‌గ్గ‌ట్టే ఈ మూవీతో పంజా వైష్ణ‌వ్ తేజ్ మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌స్తాడా? అన్న‌ది తెలియాలంటే సెప్టెంబ‌ర్ 2 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.