Begin typing your search above and press return to search.

RRV ట్రైల‌ర్ టాక్ : ఇద్ద‌రు ఈగోయిస్ట్‌ల ప్రేమ గోల‌!

By:  Tupaki Desk   |   23 Aug 2022 12:35 PM GMT
RRV ట్రైల‌ర్ టాక్ : ఇద్ద‌రు ఈగోయిస్ట్‌ల ప్రేమ గోల‌!
X
`ఉప్పెన‌`తో తొలి ప్ర‌య‌త్నంలోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకుని వంద కోట్ల క్ల‌బ్ లో చేరిన హీరో పంజా వైష్ణ‌వ్ తేజ్ మ‌ళ్లీ అదే స్థాయి స‌క్సెస్ కోసం చేసిన మూవీ `రంగ రంగ వైభ‌వంగ‌`. రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిన ఈ మూవీలో కేతిక శ‌ర్మ హీరోయిన్ గా న‌టించింది. `అర్జున్ రెడ్డి` త‌మిళ రీమేక్ `ఆదిత్య వ‌ర్మ‌`కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన గిరీషాయ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ ఎల్ పీ బ్యాన‌ర్ పై బీవీఎస్ ఎన్ ప్ర‌సాద్ నిర్మించారు.

ఇద్ద‌రు ఈగోయిస్ట్ ల రొమాంటిక్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కిన ఈ మూవీని సెప్టెంబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. రీసెంట్ గా విడుద‌ల చేసిన టీజ‌ర్‌, దేవిశ్రీ‌ప్ర‌సాద్ అందించిన లిరిక‌ల్ వీడియోల‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న ల‌భించింది. పాట‌ల్లో పంజా వైష్ణ‌వ్ తేజ్‌, కేతిక శ‌ర్మ‌ల కెమిస్ట్రి ఆక‌ట్టుకుంది. తాజాగా మంగ‌ళ‌వారం ఈ మూవీ ట్రైల‌ర్ ని చిత్ర బృందం విడుద‌ల చేసింది. చిన్న‌త‌నం నుంచి ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌దు.. నిత్యం గొడ‌వ‌లు ప‌డే వారిలో ప్రేమ ఎలా పుట్టింది?

చివ‌రికి ఈ ఇద్ద‌రు త‌మ ఈగోని ప‌క్క‌న పెట్టి ఎలా ఒక్క‌ట‌య్యారు? అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో ఈ మూవీని తెర‌కెక్కించిన‌ట్టుగా తెలుస్తోంది. `నువ్వొచ్చి మాట్లాడే వ‌ర‌కు నేను నీతో మాట్లాడ‌ను అని అమ్మాయి అంటే.. నువ్వోచ్చి నాతో మాట్లాడే వ‌ర‌కు నేను నీతో మాట్లాడ‌ను అంటూ చిన్న‌నాటి హీరో , హీరోయిన్ లు స‌వాల్ చేసుకునే స‌న్నివేశంతో ట్రైల‌ర్ మొద‌లైంది. పెద్ద‌య్యాక కూడా ఇదే ఈగో ఇద్ద‌రి మ‌ధ్య గొన‌సాగ‌డం చూపించారు.

ఎవ‌డి బండి వాడే తుడుచుకోవాలి... ఎవ‌డి లిఫ్ట్ వాడే అడుక్కోవాలి... అంటూ పంజా వైష్ణ‌వ్ తేజ్ చెబుతున్న డైలాగ్ లు.. ఇవ్వే త‌గ్గించుకుంటే బాగుంట‌ది.. అంటూ మ‌రో డైలాగ్‌.. ఇలా ఇద్ద‌ను ఈగో యిస్టుల ఎలా ప్రేమ‌లో ప‌డ్డారు? .. ఆత‌రువాత ఇరు కుటుంబాల మ‌ధ్య ఎలాంటి సంఘ‌నలు చోటు చేసుకున్నాయి అన్న‌దే ఈ చిత్ర క‌థ‌గా తెలుస్తోంది. `ఖుషీ` మూవీలోని ఈగో పాయింగ్ ని తీసుకుని ఈ చిత్ర క‌థ‌ని అల్లిన‌ట్టుగా తెలుస్తోది.

ట్రైల‌ర్ చివ‌ర్లో `నాన్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక‌లెక్క‌..ఇప్ప‌టి నుంచి ఇంకో లెక్క అంటూ వైష్ణ‌వ్ తేజ్ చెప్పే డైలాగ్ సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. వైష్ణ‌వ్ తేజ్ చెప్పే లెక్కేంటో .. ఈ ఇద్ద‌రి ప్రేమ క‌థేంటో తెలుసుకోవాలంటే సెప్టెంబ‌ర్ 2 వ‌ర‌కు వేచి చూడాల్సిందే. ఇందులోని కీల‌క పాత్ర‌ల్లో హీరో న‌వీన్ చంద్ర‌, ప్ర‌భు, న‌రేష్ న‌టించారు.