Begin typing your search above and press return to search.

‘కొత్తగా లేదేంటి’ వీడియో: రొమాన్స్ తో రెచ్చిపోయిన RRV జోడీ..!

By:  Tupaki Desk   |   29 Aug 2022 12:04 PM GMT
‘కొత్తగా లేదేంటి’ వీడియో: రొమాన్స్ తో రెచ్చిపోయిన RRV జోడీ..!
X
మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ - రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ జంటగా నటించిన న్యూ ఏజ్ యూత్ ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ''రంగ రంగ వైభవంగా''. తమిళ అర్జున్ రెడ్డి ఫేమ్ గిరీశయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది.

RRV నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల వచ్చిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. ‘తెలుసా తెలుసా’ ‘కొత్తగా లేదేంటి’ 'సిరి సిరి మువ్వల్లోనా' వంటి పాటలు కూడా శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ‘కొత్తగా లేదేంటి’ వీడియో సాంగ్‌ ని మేకర్స్ లాంచ్ చేశారు.

వైష్ణవ్ తేజ్ - కేతికా శర్మ లపై షూట్ చేసిన ఈ రొమాంటిక్ సాంగ్.. ఇద్దరి మధ్య మ్యాజికల్ కెమిస్ట్రీని ఆవిష్కరిస్తోంది. 'జలజలపాతం' గీతంలో కృతి శెట్టితో రొమాన్స్ చేసిన వైష్ణవ్.. ఈసారి కేతిక తో కలిసి రెచ్చిపోయాడు. ఈ బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్ వీక్షకులను ఆకట్టుకుంటోంది.

ప్రతీ సినిమాకు ఒక స్పెషల్ మెలోడీని అందించే రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్.. మరోసారి తన స్వరాలతో మ్యాజిక్ చేశారు. గీత రచయిత శ్రీమణి అందమైన సాహిత్యం అందించగా.. అర్మాన్ మాలిక్ మరియు హరి ప్రియ కలిసి శ్రావ్యంగా ఆలపించారు.

'రంగ రంగ వైభవంగా' చిత్రాన్ని బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మించారు. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందించగా.. కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ నిర్వహించారు.

ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 2న ఈ సినిమా విడుదల కాబోతోంది. గతేడాది 'కొండపొలం' చిత్రంతో ప్లాప్ అందుకున్న ఉప్పెన హీరో.. ఇప్పుడు 'రంగ రంగ వైభవంగా' సినిమాతో ఎలాంటి విజయం సాధిస్తారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.