Begin typing your search above and press return to search.
పెళ్లి కానుక సరే.. రంగ్ దే గుట్టు తెలిసిపోయిందిగా!
By: Tupaki Desk | 27 July 2020 12:45 PM ISTనితిన్ ఓ ఇంటివాడయ్యాడు. నెక్ట్స్ ఏంటి? అంటే హనీమూనే కదా అనుకునేరు.. అతడికి కెరీర్ టెన్షన్ బోలెడు ఉంది. భీష్మతో బ్లాక్ బస్టర్ తగిలినా వెంట వెంటనే హిట్లు కొట్టాల్సి ఉంది. ఇక కెరీర్ పరంగా వరుసగా క్యూలైన్ చాలా పెద్దదే ఉంది. సినిమా వెంట సినిమా చేయాల్సి ఉంటుంది. మహమ్మారీ లాక్ డౌన్ లో హనీమూన్ ముగించి అసలు బరిలోకి దిగాల్సి ఉంటుంది. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న రంగ్ దే ని వెంటనే పూర్తి చేసి రిలీజ్ చేయాల్సి ఉంది.
అదంతా సరే కానీ.. నితిన్ ని ఈ చిత్రంలో వెంకీ ఎలా చూపించబోతున్నాడు? అంటే దానిపై ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. నితిన్ - షాలిని పెళ్లి కానుకగా ఒక స్పెషల్ వీడియో బాగానే రిలీజ్ చేసింది రంగ్ దే టీం. కానుక సరే కానీ.. రంగ్ దే కంటెంట్ ఏంటో ఇట్టే అర్థమైపోయింది ఈ వీడియో చూశాక. ఈ వీడియో చూసి మాత్రం ఫిల్మ్ సర్కిల్స్ లో వెంకీ అట్లూరి పై డిఫరెంట్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. వెంకీ మళ్ళీ తన పాత ఫార్మాట్ లోనే సినిమా తీసినట్లు అనిపిస్తుంది అన్నదే ఆ కామెంట్!
అఖిల్- అట్లూరి కాంబినేషన్ లో వచ్చిన `మిస్టర్ మజ్ను` కానీ.. వరుణ్ తేజ్- వెంకీ అట్లూరి `తొలి ప్రేమ` కథ కానీ చూస్తే.. ఒకే లైన్ తో ఉంటాయి. అమ్మాయి ముందు అబ్బాయి వైపు మొగ్గు చూపుతుంది. ఆ తరువాత అమ్మాయికి అబ్బాయి ఇంట్లో వాళ్లు సపోర్ట్ చేస్తారు..! కాని లాస్ట్ మినిట్ వరకు అబ్బాయి ఆ అమ్మాయిని దగ్గరకి రానివ్వడు. వెంకీ అట్లూరి కథల్లో మెయిన్ లైన్ కాస్త అటు ఇటు గా ఇలానే ఉంటుంది..! ఇప్పుడు రంగ్ దే కూడా అలానే ఉంది. ఒక హిట్ ఒక ప్లాప్ తో వెంకీ ఇప్పుడు ఇండస్ట్రీ జీరో లైన్ లో ఉన్నాడు. మళ్ళీ రంగ్ దే హిట్ అయితేనే పెద్ద ఆఫర్లు వరిస్తాయి. లేదంటే కష్టమేననేది గుసగుస.