Begin typing your search above and press return to search.

నితిన్ పెళ్లి సందర్భంగా 'రంగ్ దే' టీమ్ మ్యారేజ్ గిఫ్ట్...!

By:  Tupaki Desk   |   25 July 2020 11:08 PM IST
నితిన్ పెళ్లి సందర్భంగా రంగ్ దే టీమ్ మ్యారేజ్ గిఫ్ట్...!
X
‘భీష్మ’ సక్సెస్ తో జోరు మీదున్న యంగ్ హీరో నితిన్.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో 'మహానటి' కీర్తి సురేష్ హీరోయిన్‌ గా నటిస్తోంది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైమెంట్స్ బ్యాన‌ర్‌ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా.. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించడం విశేషం. ఇప్పటికే విడుదలైన ‘రంగ్ దే’ ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి స్పందన వచ్చింది. కరోనా పరిస్థితుల కారణంగా షూటింగ్ నిలుపుదల చేసుకున్న 'రంగ్ దే' త్వరలోనే మళ్ళీ చిత్రీకరణ స్టార్ట్ చేయబోతోందని సమాచారం.

కాగా నేడు హీరో నితిన్ - షాలినిల వివాహం సందర్భంగా 'రంగ్ దే' టీమ్ మ్యారేజ్ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అయింది. 'రంగ్ దే' సినిమా నుంచి నితిన్ - కీర్తి సురేష్ కలిసి ఉన్న ఓ క్యూట్ పిక్ రిలీజ్ చేసి జూలై 26న 4 గంటల 05 నిమిషాలకి మ్యారేజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. దీంతో నితిన్ అభిమానులు 'రంగ్ దే' నుంచి రాబోయే గిఫ్ట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఓ తమ అభిమాన హీరో పెళ్లి పీటలు ఎక్కుతుండగా మరోవైపు అతని సినిమా అప్డేట్ కూడా వస్తుండటంతో ఫ్యాన్స్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక రేపు 'రంగ్ దే' టీమ్ ఇవ్వబోయే పెళ్లి కానుక స్మాల్ టీజర్ అయ్యుండొచ్చని గెస్ చేస్తున్నారు.