Begin typing your search above and press return to search.

'రంగ్ దే' సాంగ్: 'నా కనులు ఎపుడు' అంటూ మరోసారి మ్యాజిక్ చేసిన సిద్

By:  Tupaki Desk   |   4 March 2021 11:00 AM GMT
రంగ్ దే సాంగ్: నా కనులు ఎపుడు అంటూ మరోసారి మ్యాజిక్ చేసిన సిద్
X
యూత్ స్టార్ నితిన్ - కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ''రంగ్ దే''. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైమెంట్స్ బ్యాన‌ర్‌ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నాడు. మార్చి 26న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ప్రచార కార్యక్రమాలలో భాగంగా ''నా కనులు ఎపుడు'' అనే ఓ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ లిరికల్ వీడియోని సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

''నా కనులు ఎపుడు.. కననే కనని.. పెదవులెపుడూ అననే అనని.. హృదయమెపుడు విననే విననీ.. మాయలో తేలుతున్నా..'' అంటూ సాగిన ఈ గీతానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ట్యూన్ అందించారు. ఈ మెలోడీ పాటకు లిరిసిస్ట్ శ్రీమణి సాహిత్యం అందించగా.. యువ సంచలనం సిద్ శ్రీరామ్ తనదైన శైలిలో ఆలపించారు. దేవిశ్రీ కంపోజ్ చేసిన ఈ అద్భుతమైన ట్యూన్ కి సిద్ శ్రీరామ్ వాయిస్ తోడై శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇది దేవి - సిద్ కలయికలో వచ్చిన ఫస్ట్ సాంగ్. హీరో తాను ప్రేమించిన అమ్మాయిని తలచుకుంటూ తనలోని భావాలను వెల్లడించే నేపథ్యంలో ఈ పాట సాగింది. దీనికి గాయత్రీ రఘురామ్ - శేఖర్ మాస్టర్ కలిసి కొరియోగ్రఫీ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో నితిన్ - కీర్తి సురేష్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయినట్లు అర్థం అవుతోంది.

ఇప్పటికే విడుదలైన 'ఏమిటో ఇది' 'బస్టాండే బస్టాండే' పాటలకు మంచి ఆదరణ లభించింది. ఈ క్రమంలో దేవీ కంపోజిషన్ లో వచ్చిన ''నా కనులు ఎపుడు'' సాంగ్ కూడా హిట్ ట్రాక్ లిస్ట్ లో చేరిపోనుంది. ఇప్పటివరకు వచ్చిన మూడు సాంగ్స్ వింటుంటే దేవిశ్రీప్రసాద్ అందించిన ఈ ఫ్రెష్ ట్యూన్స్ సినిమా సక్సెస్ కి హెల్ప్ అయ్యేలా ఉన్నాయని చెప్పవచ్చు. ఇకపోతే ఈ చిత్రానికి లెజెండరీ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నరేష్ - వినీత్ - రోహిణి - కౌసల్య - బ్రహ్మాజీ - వెన్నెల కిషోర్ - సత్యం రాజేష్ - అభినవ్ గోమటం - సుహాస్ - గాయత్రి రఘురామ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.