Begin typing your search above and press return to search.

‘రంగ్ దే’.. న్యూ లుక్ రిలీజ్

By:  Tupaki Desk   |   25 Dec 2020 3:26 PM GMT
‘రంగ్ దే’.. న్యూ లుక్ రిలీజ్
X
నితిన్‌, కీర్తి సురేష్‌ హీరోహీరోయిన్లుగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తోన్న లవ్‌ ఎంటర్‌టైనర్ ‘రంగ్‌ దే’. లాక్‌డౌన్‌ తర్వాత షూటింగ్‌లు తిరిగి ప్రారంభం కావడంతో.. ఈ మూవీ కూడా సెట్స్ కి వెళ్లింది. ప్రస్తుతం ‘రంగ్‌ దే’ మూవీ షూటింగ్ చివరి దశలో ఉందని సమాచారం. సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

అయితే.. శుక్రవారం క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుకొని చిత్ర బృందం ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ “రంగ్ దే” పోస్టర్లను, ఫోటోలను విడుదల చేసింది. ఈ ఫోటోల్లో వైట్ టీషర్ట్ లో గాగుల్స్ పెట్టుకొని నితిన్ స్మైల్ ఇస్తుంటే.. అతన్నే తదేకంగా చూస్తున్న కీర్తి సురేష్ రెడ్ డ్రెస్ లో ఫుల్లుగా మెరిసిపోతోంది. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కాగా.. నితిన్ సినిమాల జోరు పెంచాడు. ఇటు ‘రంగ్ దే’ సినిమాలో నటిస్తూనే.. మరోవైపు గాంధీ మెర్లపాక దర్శకత్వంలో అందుధాన్ రీమేక్ లో, చంద్రశేఖర్ యేలేటి డైరెక్ట్ చేస్తున్న “చెక్” సినిమాలో నటిస్తున్నాడు. అంతేకాకుండా.. కృష్ణ చైతన్య దర్శకత్వంలోనూ ఓ మూవీ చేస్తున్నాడు.