Begin typing your search above and press return to search.

వీడియో : 'రంగ్‌ దే' రొమాంటిక్‌ ఏమిటో ఇది

By:  Tupaki Desk   |   12 Nov 2020 2:00 PM GMT
వీడియో : రంగ్‌ దే రొమాంటిక్‌ ఏమిటో ఇది
X
నితిన్‌ హీరోగా కీర్తి సురేష్‌ హీరోయిన్‌ గా 'తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్‌ ఎంటర్‌ టైనర్‌ రంగ్‌ దే సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చేంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుండి దీపావళి కానుకగా మొదటి పాటను విడుదల చేశారు. ఏమిటో ఇది వివరించలేనిది అంటూ సాగుతున్న రొమాంటిక్‌ మెలోడీ సాంగ్‌ ప్రస్తుతం యూత్‌ ఆడియన్స్‌ ను ఆకట్టుకుంటూ ఉంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు యూత్‌ ఆడియన్స్‌ ను విశేషంగా ఆకట్టుకుంటాయి అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. అన్నట్లుగానే మొదటి పాట ఆకట్టుకునే విధంగా ఉంది.

ఈ సినిమా చివరి షెడ్యూల్‌ ను మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నదాని ప్రకారం ఈ సినిమా చివరి షెడ్యూల్‌ ను దుబాయిలో చేయబోతున్నారు. అక్కడ పాటల చిత్రీకరణతో సినిమా పూర్తి అవుతుంది. సంక్రాంతికి థియేటర్లలో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ వారు నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. నితిన్‌.. కీర్తి సురేష్‌ ల కాంబోలో వచ్చిన ఒక వీడియో సినిమాపై మరింత ఆసక్తిని కలిగించింది. నితిన్‌ పెళ్లి సందర్బంగా వచ్చిన ఆ వీడియో కు ఇప్పటి వరకు 14 మిలియన్‌ ల వ్యూస్‌ వచ్చాయి.