Begin typing your search above and press return to search.

'రంగ్ దే' నుంచి వస్తున్న రొమాంటిక్ సాంగ్ లిరికల్ వీడియో..!

By:  Tupaki Desk   |   9 Nov 2020 3:30 PM GMT
రంగ్ దే నుంచి వస్తున్న రొమాంటిక్ సాంగ్ లిరికల్ వీడియో..!
X
యూత్ స్టార్ నితిన్ - కీర్తి సురేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''రంగ్ దే''. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైమెంట్స్ బ్యాన‌ర్‌ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మ్యూజికల్ జర్నీలోని ఓ రొమాంటిక్ సాంగ్ ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహకాలు చేస్తున్నారు. ఇటీవలే 'ఏమిటో ఇది.. వివరించలేనిది.. మది ఆగమన్నది.. తనువు ఆగనన్నది..' అంటూ రిలీజ్ చేసిన ఈ సాంగ్ ప్రీ ల్యూడ్ అందరిలో ఆసక్తిని రేపింది. ఈ క్రమంలో 'ఏమిటో ఇది' సాంగ్ లిరికల్ వీడియోని నవంబర్ 7న సాయంత్రం గం. 4.05 ని. లకు విడుదల చేయాలని భావించినప్పటికీ, అనుకోని కారణాల వల్ల వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో నవంబర్ 12న సాయంత్రం గం. 4.05 నిమిషాలకు ఈ రొమాంటిక్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నామని.. ఈ రొమాంటిక్ మ్యూజికల్ జర్నీ కోసం వేచి ఉండండని చిత్ర బృందం ప్రకటించింది.

కాగా, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన 'ఏమిటో ఇది' సాంగ్ ను కపిల్ కపిలన్ మరియు హరిప్రియ కలిసి ఆలపించారు. లిరిసిస్ట్ శ్రీమణి సాహిత్యాన్ని అందించాడు. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ఈ పాటకు గాయత్రీ రఘురామ్ మరియు శేఖర్ మాస్టర్ కలిసి కొరియోగ్రఫీ చేశారు. లెజెండరీ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయగా నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరించారు. కోవిడ్ నేపథ్యంలో ఇటీవలే షూటింగ్ రీస్టార్ట్ చేసి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో 'భీష్మ' వంటి సక్సెస్ ఫుల్ సినిమా తర్వాత నితిన్ నటిస్తున్న 'రంగ్ దే' చిత్రాన్ని 2021 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్లాన్స్ చేస్తున్నారు.