Begin typing your search above and press return to search.

కాజల్‌ డెడికేషన్‌ సూపర్భ్‌ గురూ!

By:  Tupaki Desk   |   23 July 2015 10:10 AM GMT
కాజల్‌ డెడికేషన్‌ సూపర్భ్‌ గురూ!
X
చందమామ కాజల్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా ఆన్‌సెట్స్‌ కాజల్‌ ఇన్వాల్వ్‌మెంట్‌ గురించి కానీ, ఓ నటిగా ఔట్‌ పుట్‌ కోసం తపించే తీరు గానీ అందరినీ మెప్పిస్తుంది. ఏదో పేమెంట్‌ విషయంలో కాస్త బెట్టు చేసినా కూడా నటనలో కమిట్‌ మెంట్‌ విషయంలో ఎప్పుడూ ప్రశంసలు అందుకుంటూనే ఉంటుంది.

ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్‌, కోలీవుడ్‌ కి అంకితమై అక్కడ వరుసగా సినిమాలు చేస్తోంది. బాలీవుడ్‌ లో దో లఫ్జాంకి కహానీ అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో రణదీప్‌ హుడా కథానాయకుడిగా నటిస్తున్నాడు. దీపక్‌ తిజోరి దర్శకత్వం వహిస్తున్నాడు. అంకిత్‌ తివారీ సంగీత దర్శకత్వంలో బాణీలు సిద్ధమవుతున్నాయి. అయితే కాజూ.. ఈ సినిమా కథానాయకుడితో కలిసి పాటల రికార్డింగు కి అటెండ్‌ అవ్వడం పెద్ద టాపిక్‌ అయ్యింది. ఓ తెలుగు కథానాయిక ఇలా చేయడం కొత్త ట్రెండ్‌ అంటూ ముచ్చటించుకుంటున్నారు.

వాస్తవానికి సినిమా ప్రారంభం కంటే ముందే రికార్డింగ్‌ కార్యక్రమాలు మొదలవుతాయి. వీటికి నటీనటులెవరూ హాజరుకారు. ల్యాబులో సంగీత దర్శకుడు, దర్శకుడు ఇతరత్రా టెక్నీషియన్లే కుస్తీలు పడుతుంటారు. పాటల చిత్రీకరణ కోసం ఆన్‌ సెట్స్‌ వెళ్లే వరకూ అసలు ఆ సినిమా ట్యూన్‌ ఏంటో కూడా తెలీదు. అలాంటిది ఇప్పుడు ట్రెండ్‌ ని మారుస్తూ కాజల్‌ తన హీరో రణదీప్‌ని వెంటేసుకుని రికార్డింగ్‌ స్టూడియోకి వెళ్లింది. ఇదో కొత్త ట్రెండ్‌ అని చెప్పుకుంటున్నారంతా. కాజల్‌ కొత్త ఫీట్‌ని, ఆలోచనని తెగ పొగిడేస్తున్నారు.