Begin typing your search above and press return to search.

ఆ హీరోకి ఆస్ట్రేలియా అవార్డ్

By:  Tupaki Desk   |   1 March 2016 4:19 AM GMT
ఆ హీరోకి ఆస్ట్రేలియా అవార్డ్
X
బాలీవుడ్ లో విలక్షణ నటుడిగా గుర్తింపు దక్కించుకున్న రణ్ దీప్ హుడా అకౌంట్ లో ఇప్పుడో అరుదైన అవార్డు కూడా వచ్చి చేరింది. ఫిలిం ఇండస్ట్రీకి అందించిన సేవలకు గాను.. ఆస్ట్రేలియాలో అఛీవ్ మెంట్ అవార్డ్ అందుకున్నాడు రణ్ దీప్. ఆస్ట్రేలియాలోని సౌత్ ఏషియన్ కమ్యూనిటీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రణ్ దీప్ హుడాకి.. సినీ రంగంలో ప్రత్యేకత చాటుతున్నందుకు గాను అవార్డ్ అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

రణ్ దీప్ సినీరంగంలోకి 2001లో అడుగు పెట్టాడు. ఈ పదిహేను సంవత్సరాల్లో ఎన్నో అరుదైన రికార్డులు, రివార్డులు, అవార్డులు సొంతం చేసుకుని.. ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందాడు. రణ్ దీప్ పోషించిన పాత్రలను వేరెవరూ చేయలేరని ఇండస్ట్రీ జనాలే అంటారంటే.. ఇతగాడి ప్రతిభ అర్ధమవుతుంది. '2001లో నేను ఇండస్ట్రీలోకి వచ్చాక నటించిన మొదటి సినిమా మాన్సూన్ వెడ్డింగ్ లో.. ఆస్ట్రేలియా ఉచ్ఛారణతో మాట్లాడతాను. నాకు అదే మంచి గుర్తింపు తెచ్చింది' అంటూ ఆస్ట్రేలియాలో అవార్డు అందుకున్నాక చెప్పాడు రణ్ దీప్.

రణ్ దీప్ ను 'బుల్లీ జీరో ఆస్ట్రేలియా' అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని ఆ దేశ టూరిజం సెక్రటరీ డానియల్ గ్రీన్ కోరడం విశేషం. ఈ అవార్డు అందుకున్నాక 'నోబడీ డైస్ హంగ్రీ' అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాడు రణ్దీప్ హుడా. ప్రస్తుతం పాకిస్తాన్‌ లో అక్రమంగా ఏళ్ళ తరబడి నిర్బందించబడి.. అక్కడి ఖైదీలచే చంపబడిన సారబ్జిత్‌ సింగ్‌ బయో పిక్‌ ''సారబ్జిత్‌'' లో టైటిల్‌ పాత్రను పోషిస్తున్నాడు రణదీప్‌. ఇతగాడి అక్క దల్బీర్‌ కౌర్‌ పాత్రలో ఐశ్వర్య రాయ్‌ మెరుస్తోంది.