Begin typing your search above and press return to search.

'రంగ్ దే' ఆ మ‌ళ‌యాల సినిమాకి రీమేక్ కాదు కదా...?

By:  Tupaki Desk   |   21 April 2020 1:30 PM GMT
రంగ్ దే ఆ మ‌ళ‌యాల సినిమాకి రీమేక్ కాదు కదా...?
X
‘భీష్మ’ సినిమాతో బంపర్ హిట్ అందుకున్న హీరో నితిన్ జోరు మీద ఉన్నారు. అదే ఊపులో యువ దర్శకుడు వెంకీ అట్లూరితో ‘రంగ్ దే’ అనే బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రంలో 'మహానటి' కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంట‌ర్‌ టైన్‌ మెంట్స్ బ్యాన‌ర్‌ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'భీష్మ' చిత్రం హిట్ కావడంతో నితిన్‌ - నాగవంశీ కాంబినేషన్ రిపీట్ చేశారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా.. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించడం విశేషం. నితిన్ - కీర్తి సురేష్‌ లు తొలిసారి ఈ ఇద్దరూ కలిసి నటిస్తుండటంతో కెమిస్ట్రీ వర్కౌట్ అయినట్టే కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి స్పందన వచ్చింది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలుపుదల చేసుకున్న 'రంగ్ దే' త్వరలోనే మళ్ళీ చిత్రీకరణ స్టార్ట్ చేయబోతోంది. అయితే ఈ మధ్య ఈ సినిమాకి సంబంధించి ఒక రూమర్ టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే.. 'రంగ్ దే' సినిమా ఒక మ‌ళ‌యాలీ సినిమాకి రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో హీరో ఫ్రీ లైప్ కి అల‌వాటు పడిన యువకుడట. అంటే మోడ్ర‌న్ స‌న్యాసి టైప్ అన్నమాట. న‌చ్చింది చేస్తూ.. నచ్చినట్లు బ్రతుకుతుంటాడట. హీరోయిన్ కూడా దాదాపు ఇదే త‌ర‌హా క్యారెక్ట‌ర్ తో ఉంటుందట. వీరిద్ద‌రు ఎలా క‌లిసారు.. మ‌రి త‌న‌లాంటి ఓ పిల్ల కోసం త‌న‌కు న‌చ్చిన బాట‌ని వ‌దిలేస్తాడా హీరో... ఇలాంటి లైన్ తో 'రంగ్ దే' రెడీ అవుతోందని ఫిల్మ్ వర్గాల సమాచారం. అయితే ఇదే త‌ర‌హాలో మ‌ళ‌యాలంలో దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా 'ఛార్లీ' అనే సినిమా వ‌చ్చింది. ఈ మూవీ అక్క‌డ పెద్ద హిట్ అవ్వ‌డ‌మే కాకుండా దుల్క‌ర్ ని మ‌రో మొట్టు పైకి ఎక్కించింది. మ‌రి నితిన్ మీద కూడా ఇప్పుడు ఇదే లైన్ తో సినిమా రెడీ అవుతుందట. ఇది తెలిసిన వారు కూడా ఏమో ఈ వార్త నిజ‌మేనేమో కావొచ్చు అంటున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే అక్కడ సూపర్ హిట్ అయిన సినిమా ఇక్కడ కూడా హిట్టయ్యి నితిన్ ని కూడా ఇంకో మెట్టు ఎక్కిస్తుందేమో చూడాలి. అంతేకాకుండా ఈ సినిమాకి హిట్ డైరెక్టర్ అని నిరూపించుకోవడానికి ఆరాటపడుతున్న వెంకీ అట్లూరి డైరెక్టర్ కావడంతో నితిన్ ఫ్యాన్స్ కొంచెం టెన్షన్ పడుతున్నారట. కాకపోతే నితిన్ - కీర్తి సురేష్ జోడీని నమ్ముకొని ఉన్నారట.