Begin typing your search above and press return to search.

ర‌ణ‌బీర్ - సందీప్ వంగా `యానిమ‌ల్` టైటిల్ టీజ‌ర్

By:  Tupaki Desk   |   1 Jan 2021 10:00 AM IST
ర‌ణ‌బీర్ - సందీప్ వంగా `యానిమ‌ల్` టైటిల్ టీజ‌ర్
X
క‌బీర్ సింగ్ ద‌ర్శ‌కుడిగా సందీప్ రెడ్డి వంగా పేరు బాలీవుడ్ లో మార్మోగింది. ఆరంగేట్ర‌మే సంచ‌ల‌నాలు సృష్టించిన ద‌ర్శ‌కుడిగా అత‌డి కంటూ ఒక స్టాట‌స్ ఉంది. ర‌ణ‌బీర్ క‌పూర్ హీరోగా అత‌డితో టీసిరీస్ సంస్థ ఓ భారీ సినిమాని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిన‌దే.

అయితే ఈ ప్రాజెక్ట్ అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వ్వ‌డంతో ర‌క‌ర‌కాల పుకార్లు షికార్ చేశాయి. వాట‌న్నిటికీ చెక్ పెడుతూ ర‌ణ‌బీర్ - సందీప్ వంగా సినిమా ఖాయ‌మేన‌ని టైటిల్ ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లో ఉంటుంద‌ని ఇంత‌కుముందు తుపాకి వెల్ల‌డించింది.

తాజాగా ఈ సినిమా గురించి చాలా ముందే ఊహించినట్లుగా టైటిల్ లుక్ ని రిలీజ్ చేశారు. `యానిమల్` అనేది టైటిల్. టీజ‌ర్ లో కాస్టింగ్ వివ‌రాల్ని వెల్ల‌డించారు. సీనియ‌ర్ న‌టుడు అనీల్ కపూర్ - ర‌ణ‌బీర్ క‌పూర్- బాబీ డియోల్ కాంబినేష‌న్ మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఇది. ఇందులో పరిణీతి చోప్రా క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

ప్రీ-లుక్ టీజర్ ‌లో రణబీర్ కపూర్ వాయిస్ తో బ్యాక్ డ్రాప్ లో క‌థ‌ను వినిపించారు. క‌థానాయ‌కుడు తన తండ్రిని తరువాతి జీవితంలో తన కొడుకుగా జన్మించమని .. ఆ తర్వాత మళ్ళీ తండ్రిగా జ‌న్మించ‌మ‌ని కూడా అడుగుతాడు. ఈ చిన్న వ‌న్ లైన‌ర్ తోనే ఎంతో ఇంప్రెస్ చేశాడు ద‌ర్శ‌కుడు. సందీప్ రెడ్డి వంగా మునుపెన్నడూ రాని స‌రికొత్త కాన్సెప్టుతో ఈ సినిమాని తీస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. 2021 కానుక‌గా ప్ర‌క‌టించిన‌ `యానిమల్` టైటిల్ జ‌స్టిఫికేష‌న్ ఏమిటి? క‌థాక‌మామీషు ఏమిటి? అన్న‌ది తెలియాలంటే ఫ‌స్ట్ లుక్ స‌హా ట్రైలర్ కోసం వేచి చూడాల్సిందే. మ‌రోసారి పాన్ ఇండియా స్థాయిలో సందీప్ వంగా సంచ‌ల‌నాలు ఖాయంగానే క‌నిపిస్తోంది.