Begin typing your search above and press return to search.

​​ఆ సినిమాలో దేవుడిగా చూపించట్లేదట

By:  Tupaki Desk   |   24 July 2017 7:19 AM GMT
​​ఆ సినిమాలో దేవుడిగా చూపించట్లేదట
X
ఒకనాటి పాపులర్ హీరో జీవిత కథను ఇప్పుడు ఒక యువ హీరో తీస్తుంటే ఆ సినిమాకు క్రేజ్ మామూలుగా ఉంటుందా చెప్పండి. పైగా ఈ హీరో జీవితంలో పలురకాల వివాదాలు - ప్రేమ గాధలు - జైల్లు జీవితంవిషాదం ఇన్ని ఉంటే ఆ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి అనే ఆసక్తి తప్పక ఉంటుంది. 3 ఇడియట్స్ - పి‌కే వంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన రాజు హిరాణీ ఈ వివాదాల హీరో జీవిత గాధను డైరెక్ట్ చేస్తున్నాడు. బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ ఈ హీరో పాత్రలో కనిపించబోతున్నాడు.

బాలీవుడ్ నిన్నటి స్టార్ హీరో సంజయ్‌ దత్‌ జీవిత కథను సినిమాగా రూపొందిస్తున్నారు రాజ్‌ కుమార్‌ హిరాణీ. ఈ సినిమా లో సంజయ్ గా నటిస్తున్న రణబీర్ కపూర్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో సూపర్ స్టార్ సంజయ్‌ దత్‌ పాత్ర ఎలా ఉండబోతుంది అనేది రణ్‌బీర్‌ చెప్పేశాడు. “ఈ సినిమాలో సంజయ్ దత్ ని దేవుడులా చూపబోవటం లేదు. సంజయ్ తన జీవితంలో విషాదాన్ని చూశాడు ప్రేమనూ చూశాడు. ఒక స్టార్ హీరో గా అనేక మలుపులు తిరిగింది ఆయన జీవితం. ఒక సమయంలో డ్రగ్స్ కు కూడా భానిస అయ్యాడు. ఇంకా అతని జైలు జీవితం ఎలా అనుభవించాడు అతనికి ఇష్టమైన తల్లి చనిపోయినప్పుడు ఎంతలా కుమిలిపోయాడు ఇలా ఒక మనిషిలో ఇన్ని వివాదాలు విషాదం ఉన్నప్పటికీ అతన్ని ఎందుకు మనం ఇష్టపడుతున్నాం అనే కోణంలో సినిమా ఉండబోతుంది'' అని చెప్పాడు.

ఒక మనిషి జీవితంలో ఇన్ని సంఘటనలు జరిగితే అతనికి జీవితం మీద ఆశ ప్రేమ ఎలా దక్కాయి అనే దానిపై దృష్టి పెట్టం అని వివరించాడు. ఈ సినిమాలో సంజయ్‌ తల్లి నర్గిస్‌ దత్‌ పాత్రలో మనీషా కోయిరాలా, భార్య పాత్రలో దియా మీర్జాలు నటిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 30న సినిమా విడుదల కాబోతోంది.