Begin typing your search above and press return to search.

సంజయ్ సోదరిగా తెలుగు హీరోయిన్

By:  Tupaki Desk   |   22 Dec 2017 6:25 PM GMT
సంజయ్ సోదరిగా తెలుగు హీరోయిన్
X
బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం సంజయ్ దత్ బయోపిక్. దత్ అనే ఈ సినిమాను దేశం మెచ్చిన దర్శకుడు రాజ్ కుమార్ హిరాని ఛాలెంజింగ్ గా తెరకెక్కిస్తున్నాడు. ఇక రన్ బీర్ కపూర్ సంజయ్ దత్ పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమా స్టార్ట్ అయ్యి చాలా రోజులు అయ్యింది. సగం పూర్తయ్యిందని తెలుస్తోంది. అయితే సినిమాలో ఇంకా మరికొన్ని పాత్రలను సెలెక్ట్ చేస్తున్నాడట దర్శకుడు.

అయితే సంజయ్ సోదరి పాత్రలో ఎవరు కనిపిస్తారు అనేది మొన్నటి వరకు చాలా సస్పెన్స్ గా కొనసాగింది. ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ పేర్లు బాగా వినిపించాయి. కానీ ఆ విషయంపై చిత్ర యూనిట్ ఎటువంటి వివరణ ఇవ్వలేదు. కానీ రీసెంట్ గా దర్శకుడు రాజ్ కుమార్ హిరాని జరిపిన ఆడిషన్ లో తెలుగు హీరోయిన్ సెలెక్ట్ అయ్యింది. రవితేజ - నేనింతే సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన సియా గౌతమ్ మొదట్లో సక్సెల్ లు చూడకపోయినా కూడా కొన్ని ఆఫర్స్ ని బాగానే అందుకుంది.

అయితే ఆమెకు ఏ సినిమా అంతగా కలిసి రాలేదు. కానీ నటనాలో మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే సంజయ్ సోదరి ప్రియ దత్ పాత్రకు సియా అయితేనే కరెక్ట్ అని రాజ్ కుమార్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో అమ్మడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందట. కనీసం ఈ సినిమా అయినా అమ్మడికి మంచి ఆఫర్స్ ని అందిస్తాయో లేదో చూడాలి.