Begin typing your search above and press return to search.

నేను చేసిన సినిమాలన్నీ గొప్ప సినిమాలే

By:  Tupaki Desk   |   11 July 2022 6:00 AM IST
నేను చేసిన సినిమాలన్నీ గొప్ప సినిమాలే
X
ప్రతి హీరో కెరీర్‌ లో కూడా కొన్ని హిట్ సినిమా లతో పాటు కొన్ని ప్లాప్‌ సినిమాలు ఉంటాయి. ఎక్కువ శాతం మంది హీరోలు నేను ఆ సినిమాను చేయకుండా ఉంటే బాగుండేది... ఆ పాత్రను చేయకుండా ఉంటే బాగుండేది అనుకుంటూ ఉంటారు. హీరోలు మాత్రమే కాకుండా హీరోయిన్స్ కూడా అప్పుడప్పుడు ఆ పాత్రను ఎందుకు చేశానో అనే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు.

కానీ బాలీవుడ్‌ మోస్ట్ రొమాంటిక్ హీరోగా పేరు దక్కించుకున్న రణబీర్ కపూర్‌ మాత్రం తాను ఇప్పటి వరకు ఏ సినిమా ను గురించి అలా ఆలోచించలేదు.. ఏ ఒక్క పాత్ర కూడా నాకు అసంతృప్తిని మిగల్చలేదు అన్నాడు. తాను ఆ సినిమా చేయకుండా ఉండాల్సిందే... పలానా పాత్రను చేసి ఉండాల్సింది కాదు అనే పశ్చాతాపం అనేది ఎప్పుడు లేదని రణబీర్‌ కపూర్‌ తాజా ఇంటర్వ్యూలో అన్నాడు.

ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణబీర్ కపూర్‌ తన సినిమాల గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. నా పిల్లలు చూడకూడని సినిమాలను.. వారితో కలిసి చూడలేని సినిమాలను నేను ఇప్పటి వరకు చేయలేదు.. చేయబోను. నేను చేస్తున్న ప్రతి ఒక్క సినిమా కూడా నా పూర్తి స్పృహతోనే చేశాను.. చేస్తున్నాను.

వినోదంను ప్రేక్షకులకు పంచడం కోసం ఎవరిని కించపర్చలేదు.. ఎవరి మనోభావాలను దెబ్బ తీయాలని నేను అనుకోను. సినిమా అనేది సమాజం పట్ల ప్రభావం చూపిస్తుంది కనుక నేను ఎంపిక చేసుకునే ప్రతి పాత్ర మరియు సినిమా విషయంలో చాలా ఆలోచిస్తాను.. ఆ తర్వాతే నిర్ణయాన్ని తీసుకుంటాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

తన కొత్త సంసార జీవితం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో పాటు పుట్టబోయే పిల్లల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా కూడా చెప్పుకొచ్చాడు. హీరోగా ఇప్పటి వరకు రొమాంటిక్ హీరోగా రొమాంటిక్ పాత్రలు చేయడం జరిగింది. కాని ఇక నుండి కొత్త పాత్రలు చేయాలనే ఉద్దేశ్యంతోనే బ్రహ్మాస్త్ర వంటి సినిమాలను చేస్తున్నట్లుగా రణబీర్ కపూర్‌ పేర్కొన్నాడు.