Begin typing your search above and press return to search.

షంషేరా... అతను ఆ హీరోనా??

By:  Tupaki Desk   |   7 May 2018 3:04 PM IST
షంషేరా... అతను ఆ హీరోనా??
X
బాలీవుడ్లో మ‌రో పెద్ద పీరియాడిక్ డ్రామా చిత్రాన్ని ప్ర‌క‌టించారు. బాలీవుడ్ విడుద‌లైనప్ప‌టినుంచి అక్క‌డ ఇలాంటి చిత్రాల‌కు బాగా డిమాండ్ పెరిగింది. బాహుబ‌లి రేంజ్‌లో విజ‌యాన్ని అందుకోవాల‌న్న త‌ప‌న‌తో అక్క‌డి ద‌ర్శ‌క నిర్మాత‌లు అలాంటి సినిమాల చిత్రీక‌ర‌ణ‌కే ఇష్ట‌ప‌డుతున్నారు. య‌ష్‌ రాజ్ ఫిల్మ్స్ వారు మ‌రో భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

హాలీవుడ్ రేంజ్‌ లో షంషేరా సినిమాను నిర్మిస్తున్న‌ట్టు ఓ వీడియో ద్వారా ప్ర‌క‌టించింది య‌ష్‌ రాజ్ ఫిల్మ్స్. సినిమా లోగోతో సహా హీరో గెట‌ప్‌ ను కూడా ప‌రిచ‌యం చేశారు. ఆ గెట‌ప్‌ లో హీరో ఎవ‌రో పోల్చుకోవ‌డం చాలా క‌ష్టం. కాని అది లవ్వర్ బాయ్ రణబీర్ కపూర్ అని హార్ట్ కోర్ ఫ్యాన్స్ ఎవ్వరికైనా అర్ధమవుతోందిలే. క‌ర‌ణ్ మ‌ల్హోత్ర ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివ‌ర‌లో సెట్స్ మీద‌కు వెళ్ళి వ‌చ్చే ఏడాదిలో విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంద‌ట. ఇక సినిమాలో న‌టించే వారిలో హీరో త‌ప్ప మిగ‌తా పాత్ర‌ల గురించి... ఎంపికైన న‌టీన‌టుల గురించి ఏం తెలియ‌దు. హీరోయిన్ పాత్ర చేస్తున్న‌దెవ‌రో ఇంకా ప్ర‌క‌టించ‌లేదు.

ర‌ణ్‌ బీర్‌ క‌పూర్ గెట‌ప్ సినిమాకు హైలైట్‌ గా నిలిచేలా ఉంది. అస్స‌లు పోల్చుకోలేని విధంగా పూర్తిగా కొత్త‌గా ఉన్నాడు ర‌ణ్‌బీర్‌. పెద్ద జుట్టుతో గెడ్డాల‌తో త‌ల‌కు క‌ట్టుతో వీపుకు పెద్ద క‌త్తితో అచ్చు వారియ‌ర్‌ లా ఉన్నాడు. ర‌ణబీర్ మంచి సినిమాల‌నే ఎంచుకున్నాడు. వ‌రుణ్ ధావ‌న్ అలియా భ‌ట్ న‌టిస్తున్న మ‌రో భారీ పీరియాడిక్ చిత్రం బ్ర‌హ్మాస్త్రలో కూడా ర‌ణ్‌బీర్ న‌టిస్తున్నాడు. బ్ర‌హ్మాస్త్రను క‌ర‌ణ్ జోహార్ భారీ సెట్టింగుల‌తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ఏ ఒక్క‌టి హిట్ అయినా కూడా ర‌ణ్ బీర్ పంట పండిన‌ట్టే.

వీడియో కోసం క్లిక్ చేయండి