Begin typing your search above and press return to search.
తన ప్రేయసి మాజీ లవర్ ని ఐటమ్ ని చేశాడు!
By: Tupaki Desk | 24 Sept 2021 6:00 PM ISTఐటమ్ సాంగ్ కోసం ప్రత్యేకించి కొందరు ఐటమ్ భామలు ఉన్నారు. నోరా ఫతేహి.. లారెస్సా బోనెస్సీ.. గాబ్రియేలా.. ముమైత్ ఇలా చెప్పుకుంటూ వెళితే పెద్ద జాబితానే ఉంది. ఇటీవల కథానాయికలు కూడా భారీ పేమెంట్ చెల్లిస్తే ఐటమ్ నంబర్లలో నర్తిస్తున్నారు.
ఊపు తెచ్చే లా ఒంపు సొంపుల వడ్డనలకు సిద్ధమవుతున్న భామలకు కొదవేమీ లేదు. అయితే ఇప్పుడు ఒక స్టార్ హీరో ఐటమ్ నంబర్ లో నర్తించేందుకు అంగీకరిండం కాస్త విడ్డూరమే. ఐటమ్ భామతో కలిసి అతడు ఐటమ్ నంబర్ చేస్తాడా.. ? లేక తానే ఐటమ్ లాగా అలరిస్తాడా? అన్నది అటుంచితే ఈ ఐటమ్ నంబర్ కి అతడు అంగీకరించడానికి కారణం కేవలం ఆఫర్ చేసిన భారీ పారితోషికం అని తెలిసింది.
బాలీవుడ్ లవర్ బోయ్ రణబీర్ కపూర్ ఐటమ్ నంబర్ లో నర్తించేందుకు అంగీకరించారు. అది కూడా తన మాజీ ప్రేయసి కత్రిన లవర్ విక్కీ కౌశల్ నటిస్తున్న సినిమాలో అతడు ఐటమ్ సాంగ్ చేయనుండడం ఆసక్తికరం. విక్కీ కౌశల్ తదుపరి చిత్రం `మిస్టర్ లెలే`లో ఒక ప్రత్యేక పాట చేయడానికి రణబీర్ సిద్ధంగా ఉన్నాడు. నిజానికి ఈ పాటలో సల్మాన్ చేయాల్సినది .. కానీ రణబీర్ మంచి ఎంపిక అని విక్కీ కౌశల్ సూచించాడట. ఈ ఐటమ్ నంబర్ కోసం భారీ పారితోషికం ముట్టజెబుతున్నారని తెలిసింది. త్వరలో గణేష్ ఆచార్య కొరియోగ్రఫీలో మెహబూబ్ స్టూడియోలో ఈ పాట ను చిత్రీకరిస్తారు. రణబీర్ ఇంతకు ముందు 2011 చిత్రం `చిల్లర్ పార్టీ`లో స్పెషల్ సాంగ్ చేశారు. శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. కియారా అద్వానీ - భూమి పెడ్నేకర్ నాయికలు. 2022 ప్రారంభంలో విడుదల కానుంది. అలాగే రణబీర్ నటించిన బ్రహ్మాస్త్ర- శంషేరా చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి.