Begin typing your search above and press return to search.

రన్బీర్.. రణ్వీర్.. ఎవరు గెలిచేది?

By:  Tupaki Desk   |   5 July 2018 12:44 AM IST
రన్బీర్.. రణ్వీర్.. ఎవరు గెలిచేది?
X
బాలీవుడ్ లో హీరో హీరోయిన్ల మధ్య రియల్ లైఫ్ లో ప్రేమకథలు ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఒక హీరో హీరోయిన్ ప్రేమించుకుంటుంటే కొందరు సహించలేరు కొందరు వారు విడిపోతే తట్టుకలేరు. అలానే రన్బీర్ - దీపికా విడిపోయినప్పుడు కూడా చాలా మంది ఫ్యాన్స్ బాధపడ్డారు. అయినా ఇదంతా ఒకప్పటి మాట.

ఇప్పుడు దీపికా రణ్వీర్ సింగ్ తో చాలా సంతోషంగా ఉంది. పాత విషయాలను మర్చిపోయి రన్బీర్ తో తమాషా అనే సినిమాలో కూడా నటించింది. అటు రన్బీర్ కూడా అలియా భట్ తో చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. రన్బీర్ దీపికా మధ్య స్నేహం బాగానే ఉన్నా - రణ్వీర్ కూడా రన్బీర్ తో స్నేహంగా ఉండగలడా అని చాలా మందికి సందేహాలు తలెత్తాయి. కానీ వారిరువురు కలిసి కాఫీ విత్ కరణ్ లో ఒకే కౌచ్ పైన కూర్చుని మాట్లాడటం చూసిన వారు సందేహాలు పటాపంచలైపోయాయి. వీరిద్దరూ బాగానే ఉన్నా - బాలీవుడ్ వారి మధ్య కాంపిటీషన్ పెట్టనుంది.

ఎం లేదండీ.. ఈ సంవత్సరం మొదట్లో పద్మావత్ సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీ గా నట విశ్వరూపం చూపించాడు. వారం కిందట రన్బీర్ సంజయ్ దత్ బయోపిక్ అయిన సంజు లో మనల్ని మెప్పించాడు. ఇద్దరూ వారి వారి సినిమాలలో 'ది బెస్ట్' పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అనడం వాస్తవమే. కానీ అవార్డు మాత్రం ఒక్కరికే దక్కుతుంది కదా.. కాబట్టి వీరి మధ్య కాంపిటీషన్ జరుగుతున్నట్టే. ఖిల్జీ గా అదరగొట్టిన రణ్వీర్ తో పోటీ పడటం చాలా బావుంటుంది అంటూ మీడియా తో ముచ్చటిస్తూ చెప్పాడు. అలానే వారు బయట స్నేహంగా ఉంటారని స్పష్టం చేశాడు.