Begin typing your search above and press return to search.

సంగీత తరంగం - ఆడియో రివ్యూ

By:  Tupaki Desk   |   12 Aug 2019 11:33 AM GMT
సంగీత తరంగం - ఆడియో రివ్యూ
X
శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన రణరంగం ఈ నెల 15 విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ట్రైలర్ తో అంచనాలు పెరిగిపోగా సౌండ్ కట్ ట్రైలర్ పేరుతో వదిలిన కొత్త వీడియో సైతం హిట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఫుల్ ఆడియో ఆల్బమ్ రిలీజ్ చేసింది యూనిట్. మొత్తం 17 నిమిషాల 13 సెకండ్లు ఉన్న ఆల్బమ్ లో 5 పాటలు ఉన్నాయి. ముగ్గురు సంగీత దర్శకులు ట్యూన్స్ కంపోజ్ చేశారు. ప్రశాంత్ పిళ్ళై - కార్తిక్ రోడ్రిగేజ్ - సన్నీ లు ట్యూన్స్ ఇచ్చారు.

మొదటిది సీతా కళ్యాణం స్మూత్ మెలోడీగా ఉన్నప్పటికీ మ్యారేజ్ బ్యాక్ డ్రాప్ కావడంతో ఇకపై పెళ్లిళ్ల వీడియోలలో ఫస్ట్ ఛాయస్ గా నిలిచేలా ఉంది. ప్రశాంత్ పిళ్ళై ట్యూన్ లో శ్రీహరి వాయిస్ లో మళ్ళీ వినేలా ఉంది. ఇక రెండో పాట కార్తీక్ రోడ్రిగెజ్ కంపోజింగ్ లో అతనే పాడిన కుమ్మేయరా పక్కా మాస్ సాంగ్. ప్రేమిస్తే వచ్చే పరిణామాలను వివరించిన తీరు బాగుంది. కృష్ణ చైతన్య సాహిత్యం 1990 బ్యాక్ డ్రాప్ ని దృష్టిలో పెట్టుకుని రాసినా ఇప్పటి యువత అంతరంగానికి దగ్గరయ్యేలా ఉంది.

మూడో పాట పిక్చర్ పర్ఫెక్ట్ సన్నీ సంగీత నేతృత్వంలో సాగింది. నిఖిత గాంధీ పాడగా కృష్ణ చైతన్య అందించిన పదాలతో మంచి ఫాస్ట్ బీట్ తో సాగింది. నాలుగోపాట కన్ను కొట్టి చూసినంట సుందరి మనసు మీటి వెళ్లినంట మనోహరి మరో క్యాచీ ట్యూన్. కార్తీక్ సంగీతం అందించి స్వయంగా పాడిన ఈ సాంగ్ వైరల్ అయ్యేందుకు ఛాన్స్ ఉండేలా సాగింది. చివరి పాట ఎవరో ఎవరోకు స్వరకర్త ప్రశాంత్ పిళ్ళై. కృష్ణ చైతన్య సాహిత్యంలో ప్రీతీ పిళ్ళై పాడగా ప్రియురాలి విరహ వేదనను వర్ణించిన తీరు వెంటాడేలా ఉంది.

మొత్తానికి రణరంగం టైటిల్ పవర్ ఫుల్ గా ఉన్నా మ్యూజిక్ అన్ని వర్గాలను ఆకట్టుకునేలా అన్ని కలిసి ప్యాక్ చేసిన కంప్లీట్ ప్యాకేజీలా ఉండటం గమనార్హం. ముగ్గురు కంపోజర్లు ట్యూన్స్ ఇచ్చినా కథకు కట్టుబడి దానికి పర్ఫెక్ట్ గా సింక్ అయ్యేలా వర్క్ చేసిన తీరు ఆకట్టుకుంది. అంచనాలు పెంచేలా ఉన్న రణరంగం ఆల్బమ్ ఈ మధ్య కాలంలో వచ్చిన డీసెంట్ మ్యూజికల్ హిట్ గా చెప్పొచ్చు.