Begin typing your search above and press return to search.

రానాని ఓ రేంజ్‌ లో ఆడేసుకున్న బాల‌కృష్ణ‌

By:  Tupaki Desk   |   3 Jan 2022 4:19 AM GMT
రానాని ఓ రేంజ్‌ లో ఆడేసుకున్న బాల‌కృష్ణ‌
X
ఓటీటీ రియాలిటీ షోల‌కు ఈ మ‌ధ్య భ‌లే క్రేజ్ వచ్చేస్తోంది. అంతే కాకుండా టాక్ షోలు కూడా పాపుల‌ర్ అయిపోతున్నాయి. ఈ సంప్ర‌దాయానికి తెర‌లేపింది `ఆహా` ఓటీటీ. ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ అవ‌తారం ఎత్తిన విష‌యం తెలిసిందే. `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బీకె` పేరుతో ఆయ‌న చేస్తున్న టాక్ షో ఓ రేంజ్ లో పాపుల‌ర్ కావ‌డమే కాకుండా `ఆహా`కు మ‌రింత బూస్ట్ ని అందించింది. తాజాగా బాల‌య్య , రానాల‌కు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమోని నిర్వాహ‌కులు రిలీజ్ చేశారు.

ఇందులో బాల‌య్య హీరో రానాని ఓ రేంజ్ లో ఆడేసుకోవ‌డం ఆక‌ట్టుకుంటోంది. ఎనిమిద‌వ ఎపిసోడ్ గా ఈ నెల 7న స్ట్రీమింగ్ కానున్న ఈ ఎపిసోడ్ ప్రోమో ఓ రేంజ్ లో అల‌రిస్తోంది. ప్రోమో లో స్టార్టింగ్ లో వేదిక‌ పైకి ఎంట్రీ ఇచ్చిన రానా... బాల‌య్య‌కు అభివాదం చేశాడు.. ఆ త‌రువాత `నా టాక్ షోల్లో బెస్ట్ ఎపిసోడ్ ప్ర‌తీ సీజ‌న్ మీదే సార్ .. అని రానా అంటే... కొత్త‌గా చెబుతావేంట‌య్యా బాల‌కృష్ణ అంటేనే బెస్ట్‌.. అని బాల‌య్య పంచ్ వేశాడు...

ఫస్ట్ టైమ్ బాల‌కృష్ణ టాక్ షో చేస్తున్నాడంటే నీకు ఏమ‌నిపించింది? అని బాల‌య్య .. రానాని ప్ర‌శ్నించాడు. `మేమంద‌రం మామూలు ట్రైన్ లో వెళుతుంటే మీరు బుల్లెట్ ట్రైన్ తీసుకుని వాచ్చారు అన్నాడు.. లాక్‌డౌన్ టైమ్ లో వ్యాక్సిన్ వ‌స్తుంద‌నుకుంటే నీ పెళ్లి న్యూస్ వ‌చ్చిందేంట‌య్యా బాబూ... అని బాల‌య్య అనేస‌రికి అంతా గొల్లున న‌వ్వేశారు. రానా కూడా న‌వ్వేశాడు. ఏంటీ ఇంత స‌డ‌న్ గా అని మ‌ళ్లీ బాల‌య్య ప్ర‌శ్నిస్తే...`అంటే ఇప్పుడు చేయాల్సిన వ‌న్నీ అయిపోయాయి మిగిలింది ఏంటంటే పెళ్లొక‌టే వుంది అని పెళ్లి చేసుకున్నా...అన్నాడు.

ఆ వెంట‌నే బాల‌య్య ` మాట‌ల్లోనే ఫోన్ తీసి రానా ద‌గ్గుబాటి అని గూగుల్ చేస్తే... నువ్వు ఎంత మందికి నో చెప్పావో.. ఎంత మందికి హ్యాండిచ్చావో గూగుల్ చెబుతుంది.. అనేశాడు. అది ఊరికే సార్ కావాల‌ని వాళ్లు వాళ్లే రాసేసుకుంటారు` అన్నాడు రానా.. దానికి బాల‌య్య నుంచి వ‌చ్చిన ఎక్స్ ప్రెష‌న్ మామూలుగా పేల‌లేదు. అంద‌గాడు గురించి రాస్తారులే... ఆర‌డుగుల బుల్లెట్టు.. అంటూ అద‌రిపోయేలా మ‌రో పంచ్ వేశారు. అది భీభ‌త్సంగా పేలింది.

ఈ సంద‌ర్భంగా బాల‌య్య‌ని రానా కొన్ని ప్ర‌శ్న‌లు వేశాడు. అందులో `వ‌సుంధ‌ర గారికి మీరు ఎప్పుడైనా `ఐ ల‌వ్ యూ చెప్పారా? అని అడిగాడు. దీనికి బాల‌య్య `నీకెందుక‌య్యా .. అంటూనే భార్య వ‌సుంద‌ర‌కి ఫోన్ చేసి ఐల‌వ్ యూ చెప్ప‌డం.. ఆమె `నాకు తెలుసు మీరెప్పుడూ న‌న్ను ప్రేమిస్తూనే వుంటార‌ని `చెప్ప‌డం న‌వ్వులు పూయించింది. ఆ త‌రువాత `కంట్రోల్ లోకి వ‌చ్చేశావ్ .. పెళ్లైయ్యాక ఇదేగా క‌ల‌వ‌డం... అని బాల‌య్య అంటే.. రానా ఇదే సార్ అనడం.. కొంచెం బ్యాలెన్స్ వ‌చ్చేసింది.. అప్ప‌ట్లో పూల‌రంగ‌డిలా తిరిగే వాడివి.. అని బాల‌య్య అన‌గానే `ఈ షో ఇలాగెలుతోందా.. ఓకే అని రానా అన‌డం.. ఆ మాట‌ల‌కు బాల‌య్య ప‌డి ప‌డి న‌వ్వ‌డం ఆక‌ట్టుకుంటోంది.

`నెం. 1 యారీ` షోలో రానా ఇదే త‌ర‌హాలో గెస్ట్ ల‌తో ఆడుకున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు రానాని అంత‌కు మించిన స్థాయిలో `అన్ స్టాప‌బుల్ `షో లో బాల‌కృష్ణ ఆడుకుంటున్న తీరు ఎపిసోడ్ ఓ రేంజ్ లో పేల‌డం కాయంగా క‌నిపిస్తోందని అంతా కామెంట్ లు చేస్తున్నారు. రానాని బాల‌య్య ప్రోమో లోనే ఈ రేంజ్ లో ఆడుకుంటే ఎంటైర్ ఎపిసోడ్ లో ఏ రేంజ్ లో ఆడేసుకున్నాడో.. ఏ రేంజ్‌లో ఈ ఎపిసోడ్ రానా సీక్రెట్ ల‌ని బ‌య‌ట పెట్ట‌నుందో అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎపిసోడ్ ఈ నెల 7న స్ట్రీమింగ్ కానుంది.