Begin typing your search above and press return to search.

నా ఫ్రెండ్‌ కు ఓటు వేయండంటున్న రానా భార్య

By:  Tupaki Desk   |   26 Oct 2021 2:30 PM GMT
నా ఫ్రెండ్‌ కు ఓటు వేయండంటున్న రానా భార్య
X
టాలీవుడ్‌ హీరో రానా భార్య మిహికా బజాజ్ బిగ్‌ బాస్ లో ఉన్న ఒక కంటెస్టెంట్ కు తన మద్దతు తెలుపుతూ ఆమెకే ఓటు వేయండి అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టడం చర్చనీయాంశం అయ్యింది. మిహికా మనసు గెలుచుకున్న ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్‌ ఎవరా అనుకుంటున్నారా.. మన తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ మాత్రం కాదు లేండి. బిగ్ బాస్ సీజన్‌ 5 తమిళం ఇటీవలే మొదలు అయ్యింది. అందులో అక్షర రెడ్డి కంటెస్టెంట్‌ గా ఉంది. ఆమె రానా భార్య మిహికా కు క్లోజ్ ఫ్రెండ్. ఇద్దరు కూడా సుదీర్ఘ కాలంగా స్నేహితులుగా ఉన్నారట. ఇద్దరు కూడా పలు సందర్బాల్లో కలిసి పని చేశారని ఇద్దరి కంబైండ్‌ స్నేహితులు చెబుతూ ఉన్నారు. ఆ స్నేహంతోనే అక్షర రెడ్డికి ఓటు వేయాలని మిహికా సోషల్‌ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసింది.

బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కోసం బయట ఉన్న వారి స్నేహితులు చేసే క్యాంపెయిన్ చాలా ఉపయోగపడుతుంది. అందుకే అక్షర కు తన మద్దతు ఉంటుందని మిహిక ముందుగానే ప్రకటించింది. ఆమె నామినేట్‌ అయిన ప్రతి సారి కూడా ప్రేక్షకులు ఆమెకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. నా స్నేహితురాలు అక్షర రెడ్డి బిగ్‌ బాస్ ట్రోఫీ దక్కించుకునేలా ఓట్లు వేయాలంది. అక్షర రెడ్డి ఖచ్చితంగా తమిళ బిగ్‌ బాస్‌ సీజన్ 5 ట్రోఫీతో తిరిగి రావాలని కోరుకుంటున్నట్లుగా ఈ సందర్బంగా మిహికా పేర్కొంది. తమిళ బిగ్‌ బాస్‌ లో తెలుగు అమ్మాయి అంటే మొన్నటి వరకు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ తెలుగు అమ్మాయి మిహికా బజాజ్‌ అని తెలిసి తెలుగు వారు మరింతగా ఆమెకు మద్దతు ఇచ్చేందుకు సిద్దం అయ్యే అవకాశం ఉంది.

తెలుగు ప్రేక్షకులు ప్రస్తుతం తమిళ బిగ్‌ బాస్ ను చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే తెలుగు లో కూడా బిగ్‌ బాస్‌ టెలికాస్ట్‌ అవుతోంది. అయినా కూడా మిహికా మద్దతు ఇవ్వడంతో పాటు అక్షర రెడ్డి తెలుగు అమ్మాయి అనే టాక్‌ ఉన్న కారణంగా ఖచ్చితంగా ఓట్లు వేసేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉంది. మీరు కూడా అక్షర రెడ్డి నామినేషన్ లో ఉన్నప్పుడు ఓట్లు వేసి ఆమెను సేవ్‌ చేయండి. మన తెలుగు అమ్మాయికి మనం సపోర్ట్‌ ఇచ్చుకుందాం అంటూ సోషల్‌ మీడియాలో కొందరు ప్రచారం మొదలు పెట్టారు. మరి మిహికా సపోర్ట్‌ ఇంకా తెలుగు వారి సపోర్ట్‌ తో అక్షర రెడ్డి ఎంత దూరం వెళ్తుందో చూడాలి.