Begin typing your search above and press return to search.
నేటితో రానా బ్యాచిలర్ లైఫ్ కి కటీఫ్
By: Tupaki Desk | 8 Aug 2020 9:15 AM ISTఆగస్టు 8 డేట్ రానే వచ్చింది. దగ్గుబాటి రానా తన ప్రియురాలు మిహీక బజాజ్ ని పెళ్లాడేస్తున్న సంగతి తెలిసిందే. నేటి పెళ్లి వేడుకలో కొద్దిమంది బంధుమిత్రులు మాత్రమే పాల్గొంటున్నారు. గడిచిన మూడు రోజులుగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో సంబరాల గురించి తెలిసిందే. పెళ్లికి ముందు వేడుకలతో ఒకటే సందడి నెలకొంది. పెళ్లికి కూడా ఇదే వేదిక కావడంతో అద్భుతమైన దీపకాంతు అలంకరణతో స్టూడియో తళుకులీనుతోంది.
ఈ రెండు రోజుల్లో హల్దీ వేడుకలు.. ఆపై మెహందీ వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. రానా- మిహీక జంట ఆనంద డోలికల్లో తేలారు. రానాతో పాటు మిహీక కూడా ఈ వేడుకల్లో ఆడి పాడింది. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాల్లో హల్ చల్ చేస్తున్నాయి.
ఓవైపు కోవిడ్ నిబంధనల్ని అమలు చేస్తూ బయో సేఫ్టీ విధానంతో దగ్గుబాటి సురేష్ బాబు బృందం అతిథుల రక్షణ చర్యలు చేపట్టడం ఆసక్తికరం. నగరం నడిబొడ్డున ఉన్న రామానాయుడు స్టూడియోస్ లో ఈ వేడుకకు రాజమౌళి .. ప్రభాస్ .. రామ్ చరణ్ తదితరులు ఎటెండవుతారని భావిస్తున్నారు.
ఇక రానా - మిహీక జంట లవ్ స్టోరి గురించి తెలిసిందే. 2020 మేలో ప్రేమలో ఉన్నామని ప్రకటించింది ఈ జంట. అటుపై రోకా వేడుక అదే నెలలో జరిగింది. నిశ్చితార్థం.. హల్దీ వేడుక.. పెళ్లి కొడుకును చేయడం.. మెహందీ వేడుక వగైరా వగైరా సందడితో దగ్గుబాటి ఫ్యామిలీ ఫుల్ చిలౌట్ చేసింది. బజాజ్ కుటుంబం హైదరాబాద్ లో స్థిరపడిన బంగారు వజ్రాభారణాల తయారీలో స్పెషలిస్టులు. ఈవెంట్ మేనేజ్ మెంట్ విద్యలో మిహీకది అందెవేసిన చేయి.