Begin typing your search above and press return to search.
పోస్టర్ టాక్: అడవిలో శివపుత్రుడా?
By: Tupaki Desk | 10 Feb 2020 5:50 PM ISTప్రయోగాలు చేయడంలో తమిళ తంబీల తర్వాతనే. తమిళ దర్శకులు నేటివిటీ టచ్ తో రా కంటెంట్ ని ఎంచుకుని డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో ప్రయోగాలు చేసి మెప్పిస్తున్నారు. ఇక తెలుగు హీరోల్లో దగ్గుబాటి వారసుడు రానా ప్రయోగాలకు ఏమాత్రం వెనకాడడు. ఇప్పటికిప్పుడు రానా టాలీవుడ్ ని షేక్ చేసే భారీ ప్రయోగాలెన్నో చేస్తున్నాడు. హిరణ్యకశిప భారీ ప్రయోగం. వేణు ఉడుగులతో విరాటఫర్వం కూడా ప్రయోగమే. దీనికంటే ముందే హాథీ మేరా సాథీ అంటూ భారీ ప్రయోగాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టాడు. తమిళ దర్శకుడు కుంకీ (గజరాజు) ఫేం సాల్మన్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ మెజారిటీ భాగం పూర్తయింది. అయితే ఇటీవలి కాలంలో హాథీ మేరా సాథీ కి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ లేదు.
అప్పట్లోనే ఫస్ట్ లుక్ విడుదలైంది. ఒక భారీ ఏనుగుతో మావటి అవతారంలో రానా ఇచ్చిన ఫోజు అభిమానుల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఆ లుక్ కి చక్కని రెస్పాన్స్ వచ్చింది. ఇది డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ ఉన్న చిత్రం. అడవుల్లోనే మెజారిటీ కథాంశం నడుస్తుంది. బ్యాక్ గ్రౌండ్ లో పచ్చని అడవులు కాకుండా బీడువారిన ఎరుపు రంగు అడవి కనిపిస్తుందని నిర్మాత డి.సురేష్ బాబు తెలిపారు. దాదాపు 30 నిమిషాల నిడివిగో విజువల్ గ్రాఫిక్స్ ఆకట్టుకోనున్నాయని.. అడవిని కూడా వీఎఫ్.ఎక్స్ లో క్రియేట్ చేస్తున్నామని తెలిపారు. అయితే ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన సరైన సమాచారం లేనేలేదు.
ఏప్రిల్ 20న ఈ సినిమా రిలీజ్ కానుందని తాజాగా సమాచారం రివీలైంది. అలాగే కొద్ది రోజుల క్రితం రిలీజైన రానా పోస్టర్ చూస్తుంటే ఆ పాత్రలో బోలెడంత సస్పెన్స్ ఎలిమెంట్ ఉంటుందని అర్థమవుతోంది. ఈ సినిమాలో రానా రాతియుగం నాటి రా అండ్ రగ్గ్ డ్ లుక్ లో కనిపిస్తారట. రానా వేషధారణ.. హావభావాలు చూస్తుంటే మొరటు శివపుత్రుడిలాగా కనిపిస్తున్నాడు. మాసిన గుబురు గడ్డం .. చెదిరిన జుట్టు.. ముఖంపై గాట్లు ... ఒంటికి గోనె సంచులు చుట్టుకున్న వైనం చూస్తుంటే ఈ పాత్ర ఎంత మాసీగా ఉంటుందో అర్థమవుతోంది. పైగా మావటి మూగవాడా? అన్న సందేహం కూడా కలుగుతోంది. ఇతడు రానా యేనా? అని డౌట్ వచ్చేలా ఉన్న ఈ పోస్టర్ క్యూరియాసిటీ పెంచుతోంది.