Begin typing your search above and press return to search.
అడవుల్లో విరాటపర్వం గెరిల్లా ఫైట్
By: Tupaki Desk | 17 Jan 2020 10:56 AM ISTటాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి కథానాయకుడిగా వేణు ఉడుగుల దర్శకత్వంలో విరాటపర్వం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తెలుగు- తమిళ భాషల్లో పతిష్టాత్మకంగా సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కేరళ అడవుల్లో చిత్రీకరణ జరుగుతోంది. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో కీలక సన్నివేశాల్ని ఫారెస్ట్ లోనే తెరకెక్కిస్తున్నారు. ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో దట్టమైన అడవులున్నా! స్క్రిప్ట్ డిమాండ్ మేరకు కేరళ అడవుల్లో కీలక షెడ్యూల్ ని ప్లాన్ చేసారు. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో స్క్రిప్ట్ కావడం క్యూరియాసిటీని పెంచుతోంది.
రానా..ఇతర తారగాణంపై తెరకెక్కిస్తున్న సన్నివేశాలు సినిమాలో హైలైట్ గా నిలుస్తాయని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ క్యూరియాసిటీని పెంచాయి. రానా లుక్....పోలీసులు- నక్సలైట్ల మధ్య భీకరమైన గెరిల్లా తరహా ఫైట్ కి సంబంధించిన పోస్టర్ ఆసక్తిని పెంచాయి. పోస్టర్ పక్కాగా రియాల్టీని తలపించేలే చక్కగా డిజైన్ చేసింది చిత్రబృందం.
కెరీర్ లో `నేనే రాజు నేనే మంత్రి` తర్వాత ఊహించని గ్యాప్ రానాకు ఒక రకంగా ఇబ్బందికరంగా మారింది. తెలుగులో మార్కెట్ ను పెంచుకునే ప్రయత్నాలు ఏవీ పెద్దగా కలిసిరాలేదు. ఆడియన్స్ అభిరుచిలో ఛేంజ్ కి తగ్గట్టే వైవిధ్యమైన కథాంశంతో విరాటపర్వం తెరకెక్కుతోంది. రానాకి ఈ సినిమా మరో కీలక మలుపు అవుతుందని ఓ కొత్త ఐడెంటిటీ దక్కుతుందని విశ్లేషణ సాగుతోంది. ఈ చిత్రంలో ప్రియమణి- టబు- ఈశ్వరి రావు- జరీనా వహాబ్ పాత్రలు లాంటి టాప్ కాస్టింగ్ పాత్రలు ఆసక్తికరంగా ఉంటాయని తెలుస్తోంది. రానా కు జోడీగా రౌడీ పిల్ల సాయి పల్లవి నటిస్తోన్న సంగతి తెలిసిందే.