Begin typing your search above and press return to search.
పెళ్లి క్యాన్సిల్ అయ్యాకా.. ఆ ముగ్గురూ మంచి ఫ్రెండ్స్!
By: Tupaki Desk | 23 April 2020 11:00 AM ISTసౌత్ స్టార్ హీరోయిన్ త్రిష కెరీర్.. వ్యక్తిగత జీవితం గురించి తెలిసిందే. కెరీర్ పీక్స్ లో ఉండగానే హీరో రానాతో త్రిష ప్రేమాయణంపై రకరకాలుగా ప్రచారమైంది. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని రానా చెబుతున్నా మీడియాలో ప్రచారం మాత్రం ఆగలేదు. ఆ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై రానా సీరియస్ గానే స్పందించారు.
అదంతా అటుంచితే .. బిజినెస్ మేన్ కం స్నేహితుడు వరుణ్ మణియన్ తో త్రిష నిశ్చితార్థం ఎపిసోడ్ గురించి తెలిసిందే. రకరకాల కారణాలతో ఆ నిశ్చితార్థం అయ్యాక పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ టైమ్ లోనే వరుణ్ మణియన్ తో త్రిష ట్విట్టర్ వార్ గురించి తెలిసిందే. ఇన్ డైరెక్టుగా ఒకరినొకరు తిట్టుకున్నారు. అన్నట్టు ఇన్ని ఎపిసోడ్స్ తర్వాతా ఆ ముగ్గురి మధ్యా రిలేషన్ షిప్ ఎలా ఉంది? అంటే తాజాగా ఓ చిట్ చాట్ లో రానా చెప్పిన సంగతులు షాక్ కి గురి చేశాయి.
త్రిష వివాహం క్యాన్సిల్ అయ్యాక.. మేం ముగ్గురం(రానా-వరుణ్ -త్రిష) స్నేహితులుగానే ఉన్నాం. కలిసి గోవాలో పార్టీ చేసుకున్నాం. చాలా ఎక్కువ సమయాన్ని గడిపి ... కాలంతో పాటు సాగే వ్యవహారాల్ని నెమరు వేసుకున్నాం అని రానా తెలిపారు. అంటే అలాంటి క్లిష్ఠ పరిస్థితిలోనూ సానుకూలంగా వ్యవహరించి ఆ ముగ్గురూ స్నేహితులుగా కొనసాగడం ప్రశంసించదగినదే. స్నేహాన్ని మించింది ఇంకేదీ లేదని ప్రూవ్ అయ్యిందన్నమాట. త్రిష ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీ నాయికగా కొనసాగుతోంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్యలో అవకాశం వచ్చినా రకరకాల కారణాలతో సున్నితంగా తిరస్కరించిన సంగతి తెలిసిందే. రానా.. వరుణ్ మణియన్ ఎవరి కెరీర్ లో వాళ్లు బిజీగానే ఉన్నారు.