Begin typing your search above and press return to search.

‘బిగ్ బాస్’లోకి స్పెషల్ గెస్ట్.. ఎవరంటే?

By:  Tupaki Desk   |   5 Aug 2017 1:49 PM GMT
‘బిగ్ బాస్’లోకి స్పెషల్ గెస్ట్.. ఎవరంటే?
X
స్పెషల్ గెస్ట్ అనగానే.. దీక్షా పంత్ లాగా ఇంకొకరు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ‘బిగ్ బాస్’ హౌస్ లోకి వస్తున్నారేమో అనుకోకండి. ఈసారి రాబోయే గెస్ట్ పార్టిసిపెంట్ గా రావట్లేదు. జస్ట్ గెస్ట్ అప్పీయరెన్స్ కోసమే. ఆ అతిథి మరెవరో కాదు.. రానా దగ్గుబాటి. ‘బిగ్ బాస్’ షోకు రాబోతున్న ఫస్ట్ బిగ్ సెలబ్రెటీ అతనే కావడం విశేషం.

తమ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నపుడు ‘బిగ్ బాస్’ షోకు వచ్చి వాటిని ప్రమోట్ చేసుకోవడం.. పనిలో పనిగా ‘బిగ్ బాస్’కు కూడా ఆకర్షణ తీసుకురావడం హిందీలో చూసే ఉంటారు. ఈ ట్రెండు తెలుగులో ఇప్పుడే మొదలవుతోంది. తన కొత్త సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’ విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ‘బిగ్ బాస్’ ద్వారా దాన్ని ప్రమోట్ చేసుకుని.. ఈ షోకు కూడా తనవంతు సాయం చేయబోతున్నాడు రానా.

‘బిగ్ బాస్’ షూటింగ్ కు వెళ్లబోతూ విమానాశ్రయంలో పంచెకట్టుతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు రానా. అతను కొన్ని రోజులుగా ఈ అవతారంలోనే కనిపిస్తున్నాడు. ‘బిగ్ బాస్’ హౌస్ లోనూ అలాగే దర్శనమివ్వనున్నాడు. ఉదయం నుంచి ‘బిగ్ బాస్’లో ఒక సర్ప్రైజ్ అంటూ సోషల్ మీడియాలో గట్టి ప్రచారమే జరుగుతోంది. సాయంత్రానికి ఆ వ్యక్తి రానానే అనే విషయం వెల్లడైపోయింది. మరి ఎన్టీఆర్ తో కలిసి రానా ఎలా సందడి చేస్తాడో చూడాలి.