Begin typing your search above and press return to search.

బావ సినిమాకు బావ‌మ‌రిది స్విఛాన్‌

By:  Tupaki Desk   |   23 Jun 2022 11:56 AM GMT
బావ సినిమాకు బావ‌మ‌రిది స్విఛాన్‌
X
అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా గురువారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైన తాజా సినిమా చాలా ప్ర‌త్యేక‌తల‌ని సంత‌రించుకుంది. అక్కినేని నాగ‌చైత‌న్య ఈ ఏడాది ప్రారంభం నుంచే స్పీడు పెంచేశారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే వెబ్ సిరీస్ లోనూ న‌టిస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. సిల్వ‌ర్ స్క్రీన్ పై హీరో మంచి డిమాండ్ వుండ‌గానే వెబ్ సిరీస్ తో ఓటీటీ బాట‌ప‌ట్టి షాకిచ్చారు.

`మ‌నం` ఫేమ్ విక్ర‌మ్ కె. కుమ‌ర్ డైరెక్ష‌న్ లో ప్ర‌స్తుతం `థాంక్యూ` మూవీ చేస్తున్నారు. స్టార్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది. రాశిఖ‌న్నా, అవికా గోర్‌, మాళ‌విక నాయ‌న్ హీరోయిన్ లు గా న‌టిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని త్వ‌ర‌లో రిలీజ్ కి రెడీ అవుతోంది.

ఇదిలా వుంటే నాగ‌చైత‌న్య తాజాగా త‌మిళ ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భుతో ఓ బైలింగ్వ‌ల్ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్స్ బ్యాన‌ర్ పై శ్రీ‌నివాస చిట్టూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. కృతిశెట్టి హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ గురువారం హైద‌రాబాద్ లో పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మై చాలా ప్ర‌త్యేకంగా నిలిచింది. పూజా కార్య‌క్ర‌మాల అనంత‌రం హీరో నాగ‌చైత‌న్య‌, కృతిశెట్టిల‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి స్టార్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను క్లాప్ నిచ్చారు. నాగ‌చైత‌న్య బావ మ‌రిది, హీరో రానా కెమెరా స్విఛాన్ చేయ‌డం ఈ మూవీ ప్ర‌త్యేక‌త‌.

టాలీవుడ్ లో చాలా రోజుల త‌రువాత ఈ అరుదై దృశ్యం కెమెరాల‌కు చిక్క‌డంతో దీనికి సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారాయి. చై సినిమా లాంఛింగ్ ఈవెంట్ లో రానా పాల్గొని కెమెరా స్విఛాన్ చేయ‌డం ఇదే తొలిసారి కావ‌డం విశేషం. ఇక ఇదే ఈ వెంట్ లో త‌మిళ క్రేజీ హీరో శివ కార్తికేయ‌న్ తో పాటు పాపుల‌ర్ వెట‌ర‌న్ డైరెక్ట‌ర్ భార‌తీరాజా కూడా పాల్గొన్నారు. ఈ సినిమాకు సంబంధించిన మ‌రో విశేషం ఏంటంటే తండ్రీ కొడుకులు.. మ్యూజిక్ లెజెండ్ మాస్ట్రో ఇళ‌య‌రాజా, యువ‌న్ శంక‌ర్ రాజా తొలిసారి క‌లిసి సంగీతం అందిస్తుండ‌టం విశేషం. ఇదొక అరుదైన క‌ల‌యిక‌.

ఇంత వ‌ర‌కు తండ్రీ కొడుకులు క‌లిసి ఏ సినిమాకు సంగీతం అందించ‌లేదు. అది కూడా తొలి సారి తెలుగు హీరో నాగ‌చైత‌న్య సినిమాకు కావ‌డం విశేషం. ఇక క్లీన్ షేవ్ తో గుబురు మీసంక‌ట్టు.. డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్ లో చాలా మాన్లీగా క‌నిపిస్తున్న హీరో నాగ‌చైత‌న్య లుక్ కూడా ఈ ఈవెంట్ కు మ‌రింత స్పెష‌ల్ గా మారింది. గ‌తంతో పోలిస్తే హీరో నాగ‌చైత‌న్య ఈ ప్రారంభోత్స‌వంలో చాలా హాండ్స‌మ్ గా క‌నిపించి ఆక‌ట్టుకున్న తీరు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

ఇన్ని ప్ర‌త్యేక‌త‌ల‌తో ప్రారంభ‌మైన ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతోంది. ఒకేసారి తెలుగుతో పాటు త‌మిళంలోనూ షూటింగ్ చేయ‌బోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల్ని చిత్ర బృందం త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నుంది.