Begin typing your search above and press return to search.

నాగశౌర్య ఇంటికి ఏనుగుల‌ను పంపిన రానా!

By:  Tupaki Desk   |   25 March 2021 4:10 AM GMT
నాగశౌర్య ఇంటికి ఏనుగుల‌ను పంపిన రానా!
X
రానా ద‌గ్గుబాటి మాంచి స్వింగులో ఉన్నారు. వ‌రుస సినిమాలతో బిజీగా ఉన్న భ‌ల్లాల‌దేవ‌.. వాటి ప్ర‌మోష‌న్ విష‌యంలోనూ జోరు చూపిస్తున్నారు. ప్ర‌ధానంగా త‌న అప్ క‌మింగ్ మూవీ ‘అరణ్య’కు అన్నీతానై వ్యవహరిస్తున్నారు. సినిమా మొత్తం రానా కటౌట్ కనిపించబోతుండగా.. ఇటు ప్రమోషన్లోనూ తానే అగ్రభాగంలో నిలిచి ముందుకు తీసుకెళ్తున్నారు.

ఇప్పటికే.. పలు ఇంట‌ర్వ్యూల‌లో పాల్గొంటూ చిత్ర విశేషాల‌ను వెల్ల‌డిస్తున్న రానా.. ఇప్పుడు మ‌రో ఇంట్రస్టింగ్ వేలో ‘అరణ్య’ను ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇండ‌స్ట్రీలోని తన మిత్రులు, స‌న్నిహితుల‌కు గిఫ్ట్స్ పంపిస్తున్నారు. ఆ గిఫ్ట్స్ అందుకున్న వారంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అదే స‌మ‌యంలో.. రానా ఐడియాకు ఫిదా అవుతున్నారు.

ఈ గిఫ్ట్స్ వివిధ ర‌కాలుగా ఉంటున్న‌ప్ప‌టికీ.. అందులో కామ‌న్ పాయింట్ మాత్రం ఒక‌టే ఉంటోంది. అదే ఏనుగు! అడ‌వుల విధ్వంసానికి వ్య‌తిరేకంగా అర‌ణ్య సినిమా తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే. ఇందులో చాలా ఏనుగుల మ‌ధ్య నివ‌సిస్తుంటాడు రానా. ఇదే విష‌యాన్ని సింబాలిక్ గా తెలియజేస్తూ సినిమాను ప్ర‌మోట్ చేస్తున్నారు.

ఈ బ‌హుమ‌తులు అందుకున్న వారిలో యువ హీరో నాగ‌శౌర్య కూడా ఉన్నారు. ఈ మేర‌కు రానాకు శుభాకాంక్ష‌లు తెలిపారు శౌర్య‌. ‘‘వ్య‌క్తిగ‌తంగా గిఫ్ట్స్ పంపినందుకు థాంక్యూ రానా. అరణ్య ట్రైలర్ అద్భుతంగా ఉంది. సినిమాలో మీ నటన, సినిమా పట్ల మీ అంకిత భావం చాలా గొప్పది. బాక్సాఫీస్ వద్ద రాకింగ్ చేస్తారు. సినిమా చూడ్డానికి వెయిట్ చేయలేకపోతున్నాను’అంటూ ట్వీట్ చేశారు శౌర్య‌.

కాగా.. అర‌ణ్య చిత్రం ఈ నెల 26వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ప్ర‌భు సోలోమ‌న్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో.. రానాతోపాటు విష్ణు విశాల్‌, జోయా హుస్సేన్‌, శ్రీయా పిల‌గావోంక‌ర్ త‌దిత‌రులు న‌టించారు. శంత‌ను మోయిత్రా సంగీతం అందించారు.