Begin typing your search above and press return to search.

నన్నొదిలేయండి బాబూ.. నాకంత టాలెంట్ లేదు!

By:  Tupaki Desk   |   23 Feb 2019 12:27 PM GMT
నన్నొదిలేయండి బాబూ.. నాకంత టాలెంట్ లేదు!
X
ఈమధ్య రిలీజ్ అయిన బాలీవుడ్ ఫిలిం 'గల్లీబాయ్' సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. బాలీవుడ్ సినిమాల తళుకుబెళుకులకు భిన్నంగా రియలిస్టిక్ ఫీల్ తో ముంబై స్లమ్స్ వాతావరణం ప్రతిబింబిస్తూ జోయా అఖ్తర్ తెరకెక్కించిన ఈ సినిమాలో రణవీర్ సింగ్.. అలియ భట్ ల నటనకు భారీ ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమా మన టాలీవుడ్ ఫిలిం మేకర్స్ దృష్టిని ఆకర్షించిందని తెలుగులోకి రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని అంటున్నారు.

ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను అల్లు అరవింద్ చేజిక్కించుకున్నారని సాయి ధరమ్ తేజ్ తో రీమేక్ చేస్తారని మొదట వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఒక బాలీవుడ్ లైఫ్ అనే ఒక ఆంగ్ల పత్రిక 'గల్లీబాయ్' రీమేక్ లో ఎవరు నటిస్తే బాగుంటుందని ఒక ఆన్లైన్ పోల్ నిర్వహించింది. రీమేక్ విషయంలో ఈ ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయని చెప్తూ.. ఈ పోల్ లో అల్లు అర్జున్.. విజయ్ దేవరకొండ.. రానా దగ్గుబాటి పేర్లను ఆప్షన్స్ గా ఇచ్చారు.

ఈ పోల్ కు రిప్లై ఇస్తూ రానా "నన్నొదిలేయండి బాబూ!! నాకంత టాలెంట్ లేదు" ట్వీట్ చేశాడు. కానీ నెటిజనులు మాత్రం అసలు ఒప్పుకోలేదు. ఒక నెటిజన్ 'సర్ టాలెంట్ కూడా మీదగ్గరకు వస్తే తన టాలెంట్ చూసుకొని వస్తే సిగ్గు పడుతుంది. మీరు సూపర్ సర్" అంటూ ఆర్జీవీ లాగా కొంచెం అర్థం చేసుకునేందుకు కష్టంగా ఉన్న కామెంట్ పెట్టాడు. మరొకరు "విజయ్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడు.. కానీ మీ స్టైల్ లో మీరు సూపర్ టాలెంటెడ్" అన్నారు. ఇంకొకరు "సర్ మీరు అలా అనకండి. మీ టాలెంట్ నెక్స్ట్ లెవెల్" అన్నారు. ఏదేమైనా రానాకు నెటిజనుల మద్దతు ఫుల్ గా ఉంది