Begin typing your search above and press return to search.

స్కూల్ ఫ్రెండ్స్ పెళ్లిలో సంద‌డే సంద‌డి

By:  Tupaki Desk   |   8 Dec 2021 4:34 AM GMT
స్కూల్ ఫ్రెండ్స్ పెళ్లిలో సంద‌డే సంద‌డి
X
న‌గ‌రంలో వెడ్డింగ్ సీజ‌న్ కొన‌సాగుతోంది. తాజాగా ఓ పెళ్లి వేడుక‌లో స్నేహితులు రామ్ చ‌ర‌ణ్‌- రానా ద‌గ్గుబాటి సంద‌డి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. ఇది ఇంత‌కీ ఎవ‌రి పెళ్లి అన్న‌ది ఆరా తీస్తే..!

చ‌ర‌ణ్ భార్యామ‌ణి ఉపాసన కామినేని సోదరి అనుష్పాల త‌న ప్రేమికుడు అర్మాన్ ఇబ్రహీంని ఈరోజు వివాహం చేసుకోనున్నారు. సంగీత్ ఇతర వేడుక నుంచి కొన్ని ఫోటోలు తాజాగా వెబ్ లోకి వ‌చ్చాయి. పెళ్లికి ముందు జరిగిన వేడుకల్లో రామ్ చరణ్.. రానా పాల్గొన్న కొన్ని ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. అనుష్పాల వివాహానికి రానా దగ్గుబాటి త‌న స‌తీమ‌ణి మిహీకా బజాజ్ తో క‌లిసి ఎటెండ‌య్యారు. ఈ అంద‌మైన జంట ఉన్న ఫోటో కూడా సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ అవుతోంది. చరణ్ ..చివరకు ``రానా దగ్గుబాటి అందంగా పెరిగాడు`` అంటూ వ్యాఖ్య‌ను జోడించ‌డం ఆస‌క్తిక‌రం.

రానా నలుపు రంగు సూట్ లో అందంగా కనిపిస్తుండగా చరణ్ కుర్తా ప్యాంట్ లో క్లాసీగా కనిపిస్తున్నాడు. అందమైన మిహీకా రఫుల్ డ్రెస్ -జాకెట్ లో క‌నిపించారు. చ‌ర‌ణ్ -రానా బాల్యం నుంచి స్నేహితులు. చెన్నైలో ఒకే స్కూల్ లో చ‌దువుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆ ఇద్ద‌రూ మంచి స్నేహాన్ని కొన‌సాగిస్తున్నారు. ఇప్పుడు చ‌ర‌ణ్ మ‌ర‌ద‌లి వివాహ మ‌హోత్స‌వంలో రానా సంద‌డి క‌నిపించింది. టాలీవుడ్ నుంచి ఇంకా ఎవ‌రెవ‌రు ఈ పెళ్లికి అటెండ‌య్యార‌న్న‌ది తెలియాల్సి ఉంది.