Begin typing your search above and press return to search.

తెల్లటి సొగసుల తళతళలు చూస్తారా?

By:  Tupaki Desk   |   24 Feb 2016 6:11 AM GMT
తెల్లటి సొగసుల తళతళలు చూస్తారా?
X
ఓ ఇంటర్నేషనల్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ కు హైద్రాబాద్ రెడీ అవుతోంది. మార్చ్ 5న గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న డ్యాన్స్ ఈవెంట్ కు ఓ ప్రత్యేకత ఉంది. ఇందులో పాల్గొనే వాళ్లంతా ఖచ్చితంగా డ్రస్ కోడ్ పాటించాలి. సెలబ్రిటీలు - స్టార్లు - గెస్టులు- పెర్ఫామర్లు.. ఇలా ఎవరైనా సరే పాలనురుగు లాంటి తెల్లటి డ్రస్ కోడ్ లోనే హాజరుకావాలి.

ఇండియాలో ఇలాంటి డ్యాన్స్ ఈవెంట్ జరగడం ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది టాప్ డీజేలు ఈ డ్యాన్సింగ్ ఈవెంట్ కు రానున్నారు. ఒక్కో డీజే వచ్చినపుడల్లా మ్యూజిక్ - అట్మాస్ఫియర్ - ఫైర్ వర్క్స్ - లైటింగ్ - స్టేజ్ డెకరేషన్ స్టైల్.. ఇలా అన్నీ మారిపోతూ ఉంటాయి. ఈ ఈవెంట్ లో టాలీవుడ్ తారలు చాలామందే పాల్గొనున్నారు. 'సూపర్బ్ గా ఉండే డ్యాన్సింగ్ ఈవెంట్ సెన్సేషన్ వైట్. తెల్లటి డ్రసింగ్ తో అందరూ ఒక చోటకు చేరే ప్రత్యేకమైన సందర్భం ఇది' అంటున్నాడు దగ్గుబాటి రాణా.

'హైద్రాబాద్ లో సెన్సేషన్ వైట్ లాంటి ఈవెంట్ జరుగుతున్నందుకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఎంజాయ్ చేయడానికి ఇదో అద్భుతమైన ప్లేస్' అని చెప్పింది రాశి ఖన్నా. ఇక 'ఆమ్ స్టర్ డామ్ లో ఈ ఈవెంట్ జరిగినపుడు వెళ్దామనుకున్నా. ఇప్పుడు అదే హైద్రాబాద్ వచ్చేస్తోంది. రండి అందరం సెలబ్రేట్ చేసుకుందాం' అంటోంది రకుల్ ప్రీత్ సింగ్.