Begin typing your search above and press return to search.

పాక్ శరణార్ధికి రానా పొగడ్తలు!!

By:  Tupaki Desk   |   15 Sept 2016 11:02 AM IST
పాక్ శరణార్ధికి రానా పొగడ్తలు!!
X
తాప్సీ పన్ను నటించిన బాలీవుడ్ మూవీ పింక్ విడుదలకు రెడీ అయిపోయింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించిన మూవీ కావడంతో.. పింక్ పై తాప్సీ చాలానే ఆశలు పెట్టుకుంది. సబ్జెక్ట్ పరంగా కూడా పెర్ఫామెన్స్ కి బాగా స్కోప్ ఉన్న పాత్ర కావడంతో.. తనకు బోలెడంత గుర్తింపు సంపాదించి పెడుతుందన్నది తాప్సీ ఆశ. సెప్టెంబర్ 16న పింక్ విడుదల కానుండగా.. రీసెంట్ గా ముంబైలో ఓ స్పెషల్ ప్రీమియర్ ను ప్రదర్శించారు.

రానాతో కలిసి ఘాజీ చిత్రంలో కూడా నటిస్తున్న తాప్సీ.. పింక్ ప్రీమియర్ కు బాహుబలి విలన్ ని ప్రత్యేకంగా ఆహ్వానించింది. అనేకమంది బాలీవుడ్ ప్రముఖులతో పాటు రానా కూడా స్పెషల్ స్క్రీనింగ్ లో పింక్ ని చూశాడు. తన సినిమాలో పాక్ శరణార్ధి రోల్ లో నటిస్తున్న తాప్సీని.. పింక్ మూవీలో విభిన్నమైన పాత్రలో చూపించిన నటన చూసి ఆశ్చర్యపోయాడట రానా. 'ఓ అద్భుతమైన సినిమా చూశా. ఈ దేశానికి చాలా అవసరమైన మూవీ- పింక్ ఇప్పుడే చూశా' అంటూ చెప్పుకొచ్చాడు రానా.

ఢిల్లీలో ఫుల్లుగా తాగేసిన ముగ్గురు కుర్రాళ్లు ముగ్గురు అమ్మాయిలను వేధించగా.. వారిపై ఈ అమ్మాయిలు తిరగబడ్డంతో.. హత్యా ప్రయత్నం కేసు పెడతారు. ఆ ముగ్గురిలో ఒకరిగా లీడ్ రోల్ ను పింక్ చిత్రంలో తాప్సీ చేస్తోంది. ట్రైలర్ లోనే ఢిల్లీ బ్యూటీ నటనకు బోలెడన్ని ప్రశంసలు వచ్చాయిలెండి. ఇప్పుడు భల్లాల పొగడ్తలు బోనస్.