Begin typing your search above and press return to search.

తొలిసారి పెళ్లి చేసుకున్న రానా!

By:  Tupaki Desk   |   10 July 2017 9:35 AM GMT
తొలిసారి పెళ్లి చేసుకున్న రానా!
X
రానా ఏంటి.. పెళ్లి చేసుకోవడం ఏంటి అంటారా..? ఇది వెండితెరకు సంబంధించిన వ్యవహారం లెండి. రానా హీరోగా అరంగేట్రం చేసి ఏడేళ్లవుతోంది. రెండంకెల సంఖ్యలో సినిమాలు చేశాడు. కానీ ఇప్పటిదాక అతను తన సినిమాల్లో పెళ్లి చేసుకున్నది ఒక్కసారేనట. అది కూడా తన లేటెస్ట్ మూవీ ‘నేనే రాజు నేనే మంత్రి’లో మాత్రమే తన పెళ్లి జరిగిందని రానా వెల్లడించాడు. ఈ చిత్రంలో తాను.. కాజల్ పెళ్లి చేసుకునే సన్నివేశం వస్తుందని.. ఈ సీన్ చేయడం తనకు కొత్త అని అన్నాడు రానా. తాను చేసే టాక్ షో ‘నెంబర్ వన్ యారీ’ ప్రోగ్రాంలో భాగంగా రానా ఈ సంగతి వెల్లడించాడు.

ఈ కార్యక్రమానికి వచ్చిన ఓ అతిథి.. రానా పెళ్లి గురించి సరదాగా వ్యాఖ్యానించాడు. రానా సినిమాల్లో మాత్రమే పెళ్లి చేసుకుంటాడని.. నిజ జీవితంలో పెళ్లి చేసుకోడని అతిథి అంటే.. తాను సినిమాల్లో కూడా పెళ్లి చేసుకోవడం అరుదని.. ‘నేనే రాజు నేనే మంత్రి’లో తొలిసారి తేజ తనకు పెళ్లి చేశాడని రానా తెలిపాడు. ‘బాహుబలి’లో తనకు కొడుకున్నట్లుగా చూపించారని.. ఆ కొడుకు వచ్చి అటు ఇటు తిరుగుతున్నా భార్య మాత్రం లేకుండా పోయిందని చమత్కరించాడు రానా. ‘బాహుబలి’లో రానా భార్యను చూపించకపోవడంపై పెద్ద చర్చ జరగడం.. దాని మీద ట్రోలింగ్ ఓ రేంజ్ లో జరడం తెలిసిందే. ఈ విషయమై రానా తన మీద తనే సెటైర్ వేసుకోవడం విశేషమే.