Begin typing your search above and press return to search.

రానా బాబూ.. ఇంకా రెడీ అవ్వలేదే?

By:  Tupaki Desk   |   25 Sep 2015 3:48 AM GMT
రానా బాబూ.. ఇంకా రెడీ అవ్వలేదే?
X
ఒక ప్రక్కన బాహుబలి యుద్దానికి బయలుదేరుతుంటే.. మన బల్లాలదేవుడు ఏం చేస్తున్నాడు? మనోడు ఇంకా రిబ్బన్‌ కటింగులూ - హెయిర్‌ సెలూన్లూ అంటూ బాగా ఎంజాయ్‌ చేస్తున్నట్లున్నాడే. అసలు చూస్తుంటే కుర్రాడు ఇప్పుడప్పుడే రంగంలోకి దిగేట్లు కనిపించట్లేదుగా. పదండి అసలు మనోడిపై ఓ లుక్కేద్దాం.

మొన్ననే అఖిల్‌ కోసం విషెస్‌ పంపిన ప్రభాస్‌ ను చూస్తే మనకు ఒక విషయం అర్ధమైపోయింది. మనోడు మళ్ళీ అమరేంద్ర బాహుబలిగా కనిపించడానికి రెడీ అయిపోయాడని. ఆల్రెడీ మునపటి మాదిరి 100 కేజీల వెయిట్‌ ఉండే కండలను పెంచేస్తున్నాడు. ఇదంతా కాదన్నట్లు జుట్టూ కూడా పెంచేస్తున్నాడు. అసలు బాహుబలిః ది బిగినింగ్‌ ప్రమోషన్ ల టైములో మనోడు ఎంత సన్నబడ్డాడో చూశాంగా.. ఇప్పుడేమో ఇలా బీభత్సంగా బరువెక్కాడు. అయితే బాహుబలి ఈ రేంజులో పెరుగుతుంటే రానా దగ్గుబాటి మాత్రం ఇంకా స్లిమ్‌ లుక్‌ లోనే దర్శనం ఇస్తున్నాడు.

చిన్ననాటి బల్లాలదేవుడి క్యారెక్టర్‌ అయినా, ముసలి బల్లాలదేవుడు అయినా.. మనోడు వెయిట్‌ పెంచాల్సిందే. కాని ఎందుకో ఇంకా స్లిమ్‌ గానే ఉన్నాడు మరి. అసలు ఎప్పుడూ వెయిట్‌ పెంచుతాడు.. బాహుబలి 2 షూటింగ్‌ ఎపుడు మొదలవుతుంది.. వాటికి విజువల్‌ ఎఫెక్టులు ఎప్పుడు పూర్తి చేస్తారూ.. సినిమా ఎన్నటికి వస్తుంది? ఒక్క రానా ను చూస్తే ఇన్ని సందేహాలు వచ్చేస్తున్నాయ్‌.