Begin typing your search above and press return to search.

అన్ స్టాప‌బుల్ కోసం ఈ సారి భ‌ళ్లాలుడు

By:  Tupaki Desk   |   1 Jan 2022 3:30 PM GMT
అన్ స్టాప‌బుల్ కోసం ఈ సారి భ‌ళ్లాలుడు
X
నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ కొత్త‌గా `ఆహా ` ఓటీటీ కోసం హోస్ట్ గా కొత్త అవ‌తారం ఎత్తిన విష‌యం తెలిసిందే. బాల‌య్య హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న టాక్ షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బికె`. క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు గెస్ట్ గా ఈ షో మొద‌లైంది. ముందు ఈ షో అంత‌గా హిట్ అవుతుందా? .. బాల‌య్య ఇంత‌కు ముందు ఎలాంటి షోల‌కి హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌లేదు క‌దా? అంటూ ర‌క ర‌కాల ఊహాగానాలు వినిపించాయి. అయితే వాట‌న్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ బాల‌య్య హోస్ట్ గా పేరుకు త‌గ్గ‌ట్టే అన్ స్టాప‌బుల్ గా దూసుకుపోతున్నారు.

బ్ర‌హ్మానందం, నేచుర‌ల్ స్టార్ నాని, రాజ‌మౌళి, ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని, సుకుమార్, ర‌ష్మిక‌, ఆ త‌రువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుక్కుల‌తో నిర్వహించిన షో, బ‌న్నీ షో నుంచి వెళ్లిపోవ‌డంతో బాల‌య్య ర‌ష్మిక ని పిలిచి భ‌లే ఎంట‌ర్‌టైన్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ ఓ రేంజ్ లో వైర‌ల్ అయింది. ఇక మాస్ మ‌హారాజాతో చేసిన ఎపిసోడ్‌, రాజ‌మౌళిని బాల‌య్య ఇబ్బంది పెట్టిన తీరు వీక్ష‌కుల్ని ఎట్రాక్ట్ చేసింది.

సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో ఈ సీజ‌న్ కి ఎండ్ కార్డ్ వేయ‌బోతున్న బాల‌య్య ఊహించ‌ని గెస్ట్ ని షోకి ఆహ్వానించ‌డం, అదీ `ఆర్ ఆర్ ఆర్‌` రిలీజ్ కోసం లాక్ చేసిన డేట్ ని ఈ ఎపిసోడ్ కోసం ఎంచుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. బాల‌య్య అన్ స్టాప‌బుల్ లోకి రాబోతున్న ఊహించ‌ని గెస్ట్ ఎవ‌రంటే భ‌ల్లాల దేవుడు రానా. ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తూ ఆహా నిర్వాహ‌కులు తాజాగా ఇందుకు సంబంధించిన ఫొటోల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేశారు.

ఎమిద‌వ ఎపిసోడ్ గా స్ట్రీమింగ్ కానున్న ఈ టాక్ షో ఈ నెల 7న స్ట్రీమింగ్ కాబోతోంది. హ్యండ్స‌మ్ హంక్‌.. అంద‌రి యార్ రానా ద‌గ్గుబాటి .. బాల‌య్య‌తో క‌లిసి షోకు కొత్త వెలుగులు అందించ‌బోతున్నాడు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ జ‌న‌వ‌రి 7న స్ట్రీమింగ్ కానుంది` అంటూ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. రానా డైలాగ్ ల‌తో బాల‌య్య చేసే హంగామా ఎలా వుండ‌బోతోందో తెలియాలంటే జ‌న‌వ‌రి 7 వ‌ర‌కు వేచి చూడాల్సిందే. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో త్వ‌ర‌లోనే బ‌య‌టికి రాబోతోంది.