Begin typing your search above and press return to search.

రానా కొత్త అవతారం.. ఇదేంటి భయ్యా!

By:  Tupaki Desk   |   31 Oct 2021 2:30 AM GMT
రానా కొత్త అవతారం.. ఇదేంటి భయ్యా!
X
టాలీవుడ్‌ యంగ్‌ హీరో రానా వరుస సినిమాలు చేయడంతో పాటు పలు కంపెనీలతో కొలబ్రేట్‌ అవుతూ ప్రమోటర్ గా వ్యవహరిస్తూ ఉంటాడు. రానా ఎప్పుడు కూడా ఏదో ఒక జాతీయ లేదా అంతర్జాతీయ సంస్థ లేదా ప్రాజెక్ట్‌ తో సంబంధాలు పెట్టుకుంటూనే ఉంటాడు. హాలీవుడ్‌ మూవీకి అప్పట్లో డబ్బింగ్ చెప్పడంతో పాటు ఆ సినిమాను ఇండియాలో ప్రమోట్‌ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా చాలా చాలా ప్రాజెక్ట్ లు ఆయన చేస్తూనే ఉన్నాడు. ఒక వైపు హీరోగా నటిస్తూ మరో వైపు ఇలాంటి అదనపు ప్రమోషన్స్‌ చేయడంలో రానా ఎప్పుడు కూడా వెనక ఉండడు అంటూ మరోసారి నిరూపితం అయ్యింది. రానా కొత్తగా సోనీ లీవ్‌ ఓటీటీ ని ప్రమోట్‌ చేసేందుకు ముందుకు వచ్చాడు.

ఇప్పటికే ఉత్తరాదిన మంచి ఆధరణ దక్కించుకున్న సోనీ లీవ్‌ ఓటీటీని సౌత్ లో విస్తరించేందుకు గాను పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రముఖ స్టార్స్ సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్ లను కూడా సోనీ వారు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం రానా ను ప్రమోటర్ గా వారు ఎంపిక చేసుకున్నారు. రానా సోనీ లీవ్‌ ప్రమోషన్ కోసం కమర్షియల్‌ యాడ్‌ లో నటించాడు. అందులో డబ్ల్యూ డబ్ల్యూ ఈ ఆర్టిస్టుగా రానా కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు ఏ సౌత్‌ హీరో కూడా ఇలాంటి ప్రయోగాన్ని చేయలేదు. మొదటి సారి రానా నుండి ఇలాంటి ప్రయోగం రాబోతున్న నేపథ్యంలో అంతా కూడా ఆశ్చర్యంగా ఆసక్తిగా చూస్తున్నారు. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమాకు ప్రాజెక్ట్‌ కు సంబంధించిన రానా అధికారికంగా త్వరలో ప్రకటించబోతున్నాడు.

ఇక రానా సినిమాల విషయానికి వస్తే ఒక వైపు విరాట పర్వం సినిమా విడుదలకు సిద్దం అవుతుండగా మరో వైపు పవన్‌ కళ్యాణ్ తో కలిసి నటిస్తున్న భీమ్లా నాయక్‌ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. మరో వైపు బాబాయితో కలిసి ఒక వెబ్‌ సిరీస్‌ ను చేస్తున్నాడు. అది ప్రముఖ ఓటీటీ అయిన నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరో వైపు రానా హిందీలో కూడా రెండు సినిమాలకు సైన్ చేశాడు అనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి సినిమాలు.. వెబ్‌ సిరీస్‌ లతో బిజీగా ఉన్న రానా ఇప్పుడు ఓటీటీ తో పాటు పలు సంస్థలకు ప్రమోటర్ గా వ్యవహరిస్తున్నాడు. రానా హీరోగానే కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా.. విలన్‌ గా కూడా వరుసగా సినిమాలు చేస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుని స్టార్‌ డమ్‌ ను దక్కించుకున్నాడు.