Begin typing your search above and press return to search.

దసరా నుండి రానా కొత్త దరువు

By:  Tupaki Desk   |   12 Oct 2015 12:21 PM IST
దసరా నుండి రానా కొత్త దరువు
X
అసలు బాబు గారు బాహుబలి సినిమా సెట్‌ లోకి ఎప్పుడు అడుగుపెడతారూ.. ఇప్పటికే ప్రభాస్‌ ఒక ప్రక్కన తిరిగి 110 కేజీల కటౌట్‌ ను సాధించేపనిలో జిమ్‌ లో బిజీగా ఉంటే.. రానా బాబు మాత్రం ఇంకా స్లిమ్‌ అండ్‌ ట్రిమ్‌ హీరోలాగానే ఉన్నాడు. అంటే బాహుబలి షూటింగ్‌ కు అప్పుడే వెళ్ళబోవట్లేదనమాట. అయితే మరో 3 నెలల వరకు బాహుబలి వైపు చూడ్డని ఇప్పుడే తెలుస్తోంది.

నిజానికి బెంగుళూరు డేస్‌ తమిళ రీమేక్‌ సినిమా పూర్తవ్వగానే.. రానా బాహుబలి 2 కోసం రెడీ అయిపోతాడని చెప్పుకున్నారు. మరి రాజమౌళి ఇంటర్నేషనల్‌ రిలీజ్‌ పై ఫోకస్‌ చేస్తుండటమో.. లేకపోతే సినిమా కథ ఇంకా ఒక కొలిక్కి రాకపోవడమో తెలియదు కాని.. మనోళ్ళు సినిమాను పట్టాలెక్కించడానికి ఇంకా టైమ్‌ పడుతుందట. అప్పుడే సమరం మొదలవ్వదూ అనే సంకేతాలు వచ్చేశాయ్‌. దానితో రానా బాబు చక్కగా దసరా నుండి కొత్త సినిమా మొదలెట్టేస్తున్నాడు.

దసరా రోజున కొరియోగ్రాఫ్‌ ప్రేమ్‌ రక్షిత్‌ ను తొలిసారి దర్శకుడిగా పరిచయం చేస్తూ.. సురేష్‌ బాబు నిర్మిస్తున్న చిత్రం మొదలవుతోంది. ఈ సినిమాలో రానా హీరోగా నటిస్తుంటే.. రెజీనా హీరోయిన్‌ గా నటిస్తోంది. ఓ మూడు నెలలు ఏకధాటిగా షూటింగ్‌ చేస్తారట. సో.. రానా బాబు కొత్త దరువు వేస్తున్నాడు కాని.. ఇంకా బాహుబలి 2 వైపు మాత్రం చూడట్లేదు.