Begin typing your search above and press return to search.

రానా నాయుడు పనైపోయింది!

By:  Tupaki Desk   |   27 May 2022 2:30 AM GMT
రానా నాయుడు పనైపోయింది!
X
దగ్గుబాటి హీరోలు వెంకటేష్ రానా ఇద్దరు కూడా మొదట సినిమాతో సరికొత్త గా కనిపించాలని ఎంతగానో ప్లాన్ చేశారు. దగ్గుబాటి నిర్మాత సురేష్ బాబు కూడా ఇద్దరితో మల్టీస్టారర్ సినిమాలు చేయాలని చాలా కథలు విన్నారు. కానీ సరైన స్క్రిప్ట్ సిద్ధంగా కాలేదు. ఇక మొత్తానికి వెంకటేష్ రానా ఇద్దరూ మొదటిసారి ఒక వెబ్ సిరీస్ ద్వారా కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

సినిమా ద్వారా బాబాయ్ అబ్బాయ్ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తారు అనుకున్న అనుకున్నారు. కానీ ఓటీటీ వెబ్ సిరీస్ ద్వార సరికొత్తగా కనిపించబోతున్నారు. నెట్ ఫ్లెక్స్ లో ప్రత్యేకంగా నిర్మిస్తున్న రానా నాయుడు అనే ప్రాజెక్టు గురించి గతంలోనే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే మొత్తానికి ఆ ప్రాజెక్ట్ షూటింగ్ కూడా ఫినిష్ అయింది. హైదరాబాద్ ముంబై ప్రాంతాల్లో షూటింగ్ చేసుకున్నటువంటి ఈ ప్రాజెక్టు తప్పకుండా సక్సెస్ అవుతుంది అని వెంకటేష్ ఎంతో నమ్మకంతో ఉన్నాడు.

రానా నాయుడు వెబ్ సీరీస్ నెట్‌ఫ్లిక్స్ అమెరికన్ సిరీస్ రే డోనోవన్ కు రీమేక్ గా రానుంది. ఆ కాన్సెప్ట్ నచ్చడంతో వెంకటేష్ ఎంతో ఇష్టంగా రానా దగ్గుబాటి తో సరికొత్తగా చేయాలనే నిర్ణయం తీసుకొని మొత్తానికి అనుకున్నట్లుగానే షూటింగ్ పూర్తి చేశాడు. ఇక ఈ ప్రాజెక్టుపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ ముగిసినట్లు క్లారిటీ ఇచ్చారు.

ఇక ఈ ప్రాజెక్టుకి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగిసిన తర్వాత వచ్చే ఏడాది మొదట్లో నెట్ ఫ్లిక్స్ లోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక ఈ ప్రాజెక్టుకు కరణ్ అన్షుమన్ డైరెక్ట్ చేశాడు. అతను ఇంతకు ముందు ఇన్ సైడ్ ఎడ్జ్ అలాగే మిర్జాపూర్ ప్రాజెక్టులతో మంచి గుర్తింపును అందుకున్నాడు.

ఇక ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ తో కూడా అంతకు మించి అనేలా ఆకట్టుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రానా నాయుడులో అభిషేక్ భలేరావు, సౌరవ్ ఖురానా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. లోకోమోటివ్ గ్లోబల్ ఇంక్ ప్రొడక్షన్ లో వెబ్ సీరీస్ ను నిర్మించారు.