Begin typing your search above and press return to search.
# కపుల్ గోల్స్.. విహారయాత్రలతో రానా-మిహీక బిజీ
By: Tupaki Desk | 23 Jan 2021 9:38 AM GMTపెళ్లి తర్వాత రానా- మిహీక జంట వరుస విహార యాత్రలతో కపుల్ గోల్స్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసినదే. ప్రయాణాలతోనే బిజీ బిజీ. ఇంతకుముందు సతీమణి మిహీక పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి రానా స్పెషల్ ప్లాన్ గుట్టు చప్పుడు కాకుండా సాగింది. ఎవరికీ తెలియని ఒక అరుదైన అన్ నోన్ లొకేషన్ కి ఈ జంట రొమాంటిక్ వెకేషన్ కి వెళ్లింది. ఆ తర్వాత రానా దగ్గుబాటి - మిహీకా బజాజ్ హైదరాబాద్ విమానాశ్రయంలో గుర్తు పట్టని విధంగా మాస్కులతో ప్రత్యక్షమయ్యారు.
ఆగస్టు 8 న వివాహం తర్వాత ఈ జంట మొదటి వెకేషన్ అది. ఆ తర్వాత ఇటీవలే మరోసారి ఈ జంట ముంబై సహా పలు లొకేషన్లకు వెళ్లినప్పటి ఫోటోలు వైరల్ అయ్యాయి. పెళ్లామ్స్ కి రానా పిజ్జా పార్టీ ఇచ్చి.. అక్కడినుంచి ఒక ఫోటోను షేర్ చేయగా అది వైరల్ అయ్యింది.
రానా- మిహీక ఎయిర్ పోర్ట్ లుక్ లు ఇప్పటికే అభిమానులకు బోలెడంత సర్ ప్రైజ్ ని ఇచ్చాయి. మరోసారి కూల్ కపుల్ హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రంలో కెమెరా కంటికి చిక్కారు. ఈ జంట విహార యాత్రను ముగించి తిరిగి వస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. రానా-మిహీక వివాహం ఆగస్టు 8 న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ ఆత్మీయ వివాహానికి వెంకటేష్ దగ్గుబాటి- సమంత- నాగ చైతన్య సహా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కొద్దిమంది పరిశ్రమ అతిథులు ఈ వేడుకలో సందడి చేశారు.