Begin typing your search above and press return to search.

స‌తీమ‌ణి మిహీక‌తో చ‌ప్పుడు చేయ‌క‌ ఎటో ఎగిరిపోయాడు!

By:  Tupaki Desk   |   20 Dec 2020 8:10 AM GMT
స‌తీమ‌ణి మిహీక‌తో చ‌ప్పుడు చేయ‌క‌ ఎటో ఎగిరిపోయాడు!
X
పెళ్లి త‌ర్వాత రానా ఒక రోజంతా క‌నిపించ‌లేదు. ఆరోజంతా ఎక్క‌డికి వెళ్లాడు? అంటే.. స‌తీమ‌ణి మిహీక పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి ఈ జంట‌ ఎవ‌రికీ తెలియని ఒక అరుదైన అన్ నోన్ ప్రదేశానికి వెళ్లార‌‌ట‌. ఇంత‌కీ ఏ ప్లేస్? అంటే.. ఈ జోడీనే ఆ గుట్టు విప్పాలి సుమీ.

రానా దగ్గుబాటి - మిహీకా బజాజ్ హైదరాబాద్ విమానాశ్రయంలో గుర్తు ప‌ట్ట‌లేని విధంగా క‌నిపించ‌డంతో అభిమానుల్లో ఒక‌టే సందేహం. అలా మాస్కులు ధ‌రించి క‌ళ్ల‌జోళ్ల‌తో క‌వ‌ర్ చేసేస్తే అర్థం కాద‌నుకున్నారా? మిహీక బ‌ర్త్ డే సంద‌ర్భంగా రానా ఇలా స‌ర్ ప్రైజింగ్ గా వెకేష‌న్ ని ప్లాన్ చేశారన్న‌మాట‌.

ఆగస్టు 8 న వివాహం తర్వాత ఈ జంట మొదటి వెకేష‌న్ ఇది. మిహీక బ‌ర్త్ డే సంద‌ర్భంగా రానా మిడ్ నైట్ 12 కి కొవ్వొత్తి వెలిగించి పిజ్జా పార్టీ చేశార‌ట‌. తన భార్య మిహీకా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి సెలవు తీసుకోవడం పైనా ఫ‌న్నీగా చమత్కరించాడు.

పెళ్లామ్స్ కి రానా పిజ్జా పార్టీ ఇచ్చి.. అక్క‌డినుంచి ఒక ఫోటోను షేర్ చేశాడు. ``ఈరోజు పెళ్లామ్స్ పుట్టినరోజు.. కాబట్టి నాకు సెలవు..`` అంటూ ఛ‌మ‌త్క‌రించాడు. ఈవెంట్ మేనేజ‌ర్ కం బిజినెస్ మ్యాగ్నెట్ మిహీకా బజాజ్ సెలవు తీసుకోవటానికి పాపం రానా బలవంతం చేయాల్సి వ‌చ్చింద‌ట‌. మొత్తానికి ఈ జంట త‌మ‌ అభిమానుల కోసం జంట లక్ష్యాలను నిర్దేశించారు.

విమానాశ్రయం నుంచి వచ్చిన ఈ జంట ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. యాధృచ్ఛికంగా అయినా ఈ జంట వారి వివాహం త‌ర్వాత‌ బహిరంగంగా కనిపించిన తొలి సంద‌ర్భంగా కూడా ఇదే. రానా- మిహీక ఇద్దరూ తమ ఎయిర్ పోర్ట్ లుక్ తో ఇలా స‌ర్ ప్రైజ్ చేశారు. మిహీకా బజాజ్ డెనిమ్ ష‌ర్ట్- జీన్స్ ధరించి క్లాస్సీగా కనిపించ‌గా.. రానా బూడిద రంగు జాకెట్ ఆకుపచ్చ టీ షర్టు.. యాష్ జాగర్ ప్యాంటు ధరించాడు. ఇద్దరూ ఫేస్ మాస్క్ ల‌తో క‌నిపించారు.

రానా-మిహీక వివాహం ఆగస్టు 8 న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జ‌రిగింది. ఈ ఆత్మీయ వివాహానికి వెంకటేష్ దగ్గుబాటి- సమంత- నాగ చైతన్య సహా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కొద్దిమంది ప‌రిశ్ర‌మ అతిథులు విచ్చేశారు.