Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : కొత్త జంట క్యూట్‌ పిక్‌ వైరల్‌

By:  Tupaki Desk   |   23 Aug 2020 11:30 PM GMT
ఫొటోటాక్‌ : కొత్త జంట క్యూట్‌ పిక్‌ వైరల్‌
X
టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ రానా ఇటీవలే ఒక ఇంటి వాడు అయ్యాడు. ఎన్నో ఏళ్లుగా రానా పెళ్లి గురించి మీడియాలో వార్తలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఇన్నాళ్లకు మిహీకా బజాజ్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ లాక్‌ డౌన్‌లోనే రానా తన ప్రేమ విషయాన్ని బయట పెట్టాడు. ఆమె నా ప్రేమను అంగీకరించింది అంటూ రానా పెట్టిన పోస్ట్‌తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించి ఆ తర్వాత ఫాస్ట్‌ ఫాస్ట్‌ గా పెళ్లి వరకు వెళ్లాడు. ఈ లాక్‌ డౌన్‌ లోనే అతి తక్కువ మంది సెలబ్రెటీ గెస్ట్‌ ల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.

రానా మిహీకా బజాజ్‌ ల పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దగ్గుబాటి కుటుంబం ఫొటో అందరి దృష్టిని ఆకర్షించి ఈమద్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా షేర్‌ అయిన ఫొటోల్లో ఒకటిగా నిలిచింది. తాజాగా ఈ ఫొటోను మిహీకా బజాజ్‌ షేర్‌ చేశారు. సోషల్‌ మీడియాలో ఈ ఫొటోను షేర్‌ చేసిన వెంటనే తెగ స్పందన వచ్చేసింది. మిహీకా మరియు రానాలు పెళ్లి వేడుకల్లో భాగంగా ఈ ఫొటోను తీసి ఉంటారు. ఆ సమయంలో బయటకు రాని ఈ ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.