Begin typing your search above and press return to search.

రానాకు స్వాగతం అంటున్న మిహికా వదినమ్మ

By:  Tupaki Desk   |   13 May 2020 10:51 AM GMT
రానాకు స్వాగతం అంటున్న మిహికా వదినమ్మ
X
ఇష్టం ఉన్నా లేకపోయినా స్క్రీనుకు ఓ మూల ఎప్పుడూ తిరుగుతూ ఉండే బాక్సులో కరోనా కౌంట్లు చూసుకుంటూ కాలం గడుపుతూ ఉండే జనాలకు రానా దగ్గుబాటి ఒక్కసారిగా సర్ ప్రైజ్ ఇచ్చాడు. మిహికా బజాజ్ తనకు 'యస్' చెప్పిందోచ్ అంటూ సోషల్ మీడియాలో షేక్ చేసే న్యూస్ చెప్పాడు. రానా అలా పోస్ట్ పెట్టడం ఆలస్యం.. కొత్త కపుల్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

రానాకు అన్ని ఇండస్ట్రీలలో ఫ్రెండ్స్ ఉన్నారు కదా.. దీంతో ఆ వుడ్డు ఈ వుడ్డు అనే తేడా లేకుండా చాలామంది సెలబ్రిటీలు రానాకు అభినందనలు తెలిపారు. ఇదిలా ఉంటే ఇటు రానా.. అటు మిహికా కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంపై సంతోషం వ్యక్తం చెయ్యడం విశేషం. మిహికా వదిన( సొంత అన్నయ్య సమర్థ్ బజాజ్ సతీమణి) సాషా రావల్ బజాజ్ ఫుల్ గా ఎగ్జైట్ అయింది. తన ఇన్స్టా ఖాతా ద్వారా రానా-మిహికాల ఫోటో పోస్ట్ చేసి "సో ఎగ్జైటెడ్ బేబీ మిహికా. రానా దగ్గుబాటి వెల్కం టు ది ఫ్యామిలీ. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ఎదురు చూస్తున్నా" అంటూ పోస్ట్ పెట్టారు.

రెండు కుటుంబాల వైపు పాజిటివ్ గా ఉన్నారు కాబట్టి అతి త్వరలో డుండుంపీపీలు ఖాయమని అనుకోవచ్చు. ఈ డిసెంబర్లో వివాహం అని ఇప్పటికే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా ఈ లాక్ డౌన్ బ్యాచిలర్లు ఒక్కొక్కరుగా పెళ్లికి రెడీ అవుతుండడం విశేషమే. ఇంకా ఎంతమంది బ్యాచిలర్లు శుభవార్తలతో లైన్ లో ఉన్నారో ఏంటో!