Begin typing your search above and press return to search.

పవన్‌ రీమేక్ సస్పెన్స్‌ మరింత పెంచిన రానా

By:  Tupaki Desk   |   9 Nov 2020 4:30 PM GMT
పవన్‌ రీమేక్ సస్పెన్స్‌ మరింత పెంచిన రానా
X
మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ ను తెలుగులో పవన్‌ తో సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ వారు రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే. ఇటీవలే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆ సినిమాలో బీజూ మీనన్‌ పోషించిన పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రను పవన్‌ పోషించబోతున్నాడు. ఇక మరో హీరో పృథ్వీరాజ్‌ పోషించిన పాత్రను ఎవరు చేయబోతున్నారు అంటూ మొదటి నుండి సస్పెన్స్‌ నెలకొంది. పలువురు యంగ్‌ హీరోలు ఆ పాత్రకు గాను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

పవన్‌ తో మూవీ అంటే ఎంతో మంది యంగ్‌ హీరోలు సిద్దంగా ఉంటారు. ఆ అవకాశం ఎవరికి దక్కుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రానా పేరు ఎక్కువగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ విషయమై ప్రశ్నించగా రానా స్పందిస్తూ ఆ రీమేక్ విషయమై నన్ను సంప్రదించిన మాట వాస్తవమే. కాని ఇంకా అది ఫైనల్‌ అవ్వలేదు అన్నాడు. రానా ఆ మాట చెప్పడంతో సస్పెన్స్‌ మరింత ఎక్కువ అయ్యంది. రానా నే నటించే అవకాశం ఉందని కొందరు... అదే నిజం అయితే రానా క్లారిటీ ఇచ్చే వాడు కదా అంటూ మరి కొందరు నెట్టింట ఎవరికి వారు ఊహాగాహాల్లో మునిగి తేలుతున్నారు.

రానా ప్రస్తుతం అరన్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాడు. మరో వైపు వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న విరాటపర్వం సినిమా షూటింగ్‌ మద్యలో ఉంది. త్వరలో ఆ సినిమా షూటింగ్‌ ను ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు అయినా సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. మరో వైపు బాబాయితో కూడా ఒక సినిమాను చేయబోతున్నట్లుగా రానా ఇటీవలే ప్రకటించాడు. అది ఎప్పుడు అనేది తెలియదు. పవన్‌ తో రానా కలిసి నటిస్తే ఖచ్చితంగా అదో మంచి సినిమా అవ్వడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.